Vikram, Premkumar: విక్రమ్, 96 ప్రేమ్ కుమార్.. వయలెంట్ యాక్షన్ థ్రిల్లర్
ABN , Publish Date - Jul 16 , 2025 | 12:42 PM
తమిళనాట ఓ అసక్తికర కాంబినేషన్ సెట్ అయింది.
ఏడేండ్ల క్రితం 96 అనే చిత్రంతో సెన్షేషన్ అయిన ప్రేమ్ కుమార్ (Prem Kumar) ఆపై అచి తూచీ మాత్రమే సినిమాలు చేస్తూ తనకంటూ ఓప్రత్యేక శైలిని ఏర్పాటు చేసుకున్నాడు. గత సంవత్సరం కార్తి, అరవింద్ స్వామిలతో ‘మెయ్యళగన్’ (Meiyazhagan) అనే సినిమాతో ఇంటిల్లిపాదితో ఎమోషనల్జర్నీ చేయించి తన ప్రత్యేకతను నిలుపుకున్నారు. ఆయన తమిళంలో చేసిన 96 చిత్రం తెలుగులో జానుగా రీమేక్ కాగా, ‘మెయ్యళగన్’ సత్యం సుందరంగా విడుదలై భారీ విజయాలనే సొంతం చేసుకున్నాయి. అయితే ఈ చిత్రం తర్వాత డైరెక్టర్ ప్రేమ్ చేయబోయే సినిమా ఏంటి, ఎలా ఉండబోతుందో అనేది చాలామందికి ఎదురవుతున్న ప్రశ్న.
ఈ నేపథ్యంలో తాజాగా ఆయన చేయబోయే సినిమా గురించి నెట్టింట అనేక వార్తలు వస్తున్నాయి. అందుతున్న తాజా సమాచారం ప్రకారం ప్రేం కుమార్ తన కొత్త ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోండగా అందులో చియాన్ విక్రమ్ (ChiyaanVikram) హీరో అని సంచలన వార్త బయటకు వచ్చింది, సినిమా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కాగా.. ఈ చిత్రం పూర్తిగా యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్‌గా రూపొందనున్నట్లు వినికిడి. అయితే.. ఇప్పటికే.. విక్రమ్ తన కెరీర్‌లో ఎన్నో విభిన్న కాన్సెప్ట్ సినిమాలు చేసినప్పటికీ, 64వ చిత్రంగా వస్తున్న ఈ మూవీ మాత్రం ఫ్యాన్స్‌కి మరో లెవల్ ట్రీట్ ఇవ్వనుందనే టాక్ వినిపిస్తోంది.
ఇదిలాఉంటే.. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోందని. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే, వచ్చే ఏడాది ఆరంభంలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. విక్రమ్ ప్రస్తుతం కొన్ని ఆసక్తికరమైన సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, ప్రేమ్ కుమార్ చెప్పిన కథ బాగా ఆకట్టుకుందని అందుకే వెంటనే డేట్స్ కూడా అడ్జస్ట్ చేసినట్లు సమాచారం. ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థ వేల్స్ పిల్మ్ ఇంటర్నేషనల్ (Vels Film International) సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుండగా ప్రేమ్ కుమార్ శైలికి పూర్తి భిన్నంగా వయలెంట్, యాక్షన్‌గా ఈ సినిమా ఉండనుంది. కాగా ఈ చిత్రంపై ఈ రెండు రోజుల్లోనే అధికారిక ప్రకటన రానుంది.
ఇవి కూడా చదవండి..
సడన్‌గా ఓటీటీకి.. బాక్సాఫీస్‌ను అల్లాడించిన హాలీవుడ్ యాక్షన్, అడ్వెంచర్
ఓటీటీకి.. వణుకు పుట్టించే డార్క్ మైథలాజికల్ థ్రిల్లర్! ఎందులో అంటే
ఈ వారం OTTలో.. దుమ్ము రేపే కొత్త రిలీజ్‌లు! ఆ నాలుగు వెరీ స్పెషల్
DNA OTT: అదిరిపోయే.. థ్రిల్లర్ ఓటీటీకి వచ్చేస్తోంది