How to Train Your Dragon OTT: సడన్‌గా ఓటీటీకి.. బాక్సాఫీస్‌ను అల్లాడించిన హాలీవుడ్ యాక్షన్, అడ్వెంచర్
ABN , Publish Date - Jul 15 , 2025 | 01:27 PM
గత నెలలో ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలై వేల కోట్లు కొల్లగొట్టి సునామీ సృష్టించిన హాలీవుడ్ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.
గత నెలలో ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలై వేల కోట్లు కొల్లగొట్టి సునామీ సృష్టించిన హాలీవుడ్ చిత్రం హౌ టు ట్రెయిన్ యువర్ డ్రాగన్ (How to Train Your Dragon). గతంలో యానిమేషన్ రూపంలో నాలుగైదు భాగాలుగా వచ్చి బహుళ ప్రాచూర్యం పొందిన ఈ చిత్రం ఇప్పుడు లైవ్ యాక్షన్‌గా ప్రేక్షకుల ఎదుటకు వచ్చి వసూళ్ల పరంగా రికార్టులు నెలకొల్పింది. కాసుల వర్షం కురిపించింది. ఇప్పుడీ సినిమా మంగళవారం నుంచి డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. మేసన్ థేమ్స్ (హికప్) (Mason Thames), నికో పార్కర్ (ఆస్ట్రిడ్) (Nico Parker), జెరార్డ్ బట్లర్ (స్టాయిక్), కీలక పాత్రల్లో నటించగా పూర్వం ఈ యానిమేషన్ సిరీస్‌లను డైరెక్ట్ చేసిన డీన్ డెబ్లోయిస్ (Dean DeBlois) తిరిగి ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించి దర్శకత్వం వహించచడం విశేషం.
కథ విషయానికి వస్తే.. బర్క్ అనే దీవిలో నివసించే వైకింగ్స్‌కు అక్కడే సమీపంలో ఉన్న డ్రాగన్స్ వారి గ్రామాలు, ఇండ్లపై దాడి చేసి పశువులను ఎత్తుకెలుతుంటాయి. దీంతో వారు తరుచూ డ్రాగన్లతో పోరాడుతూ దొరికిన వాటిని మట్టు బెట్టడమే లక్ష్యంగా పెట్టుకుంటారు. ఈ క్రమంలో చాలా మంది డ్రాగన్లను చంపడానికి ఆసక్తి చూపుతుంటారు. అయితే స్టాయిక్ ది వాస్ట్ అనే యోధుడి కుమారుడు హికప్ హాడక్ అనే కుర్రాడు మాత్రం బలహీనుడని, ఎలాంటి యుద్ధం చేయలేడంటూ అక్కడి వారు హేళన చేస్తుంటారు. ఓరోజు ఆ గ్రామంపై డ్రాగన్లు దాడి చేసిన సమయంలో కుర్రాడు హికప్ వళ్ల అరుదైన నైట్ ఫ్యూరీ జాతికి చెందిన డ్రాగన్ తీవ్రంగా గాయ పడుతుంది. దీంతో హికప్ దానిని రక్షించి టూత్‌లెస్ అనే పేరు పెడతాడు.. ఈనేపథ్యంలో వారిద్దరి మధ్య అనుబంధం పెరుగుతుంది. హికప్ డ్రాగన్‌లు చెడ్డవి కాదని, మనుషులతో స్నేహంగా ఉంటాయని గ్రహించి అక్కడి గ్రామస్తులను నమ్మించాలని చూసి విఫలం అవుతాడు. పైగా గ్రామస్తులు దానిని చంపేయాలని చూస్తుంటారు. సరిగ్గా అదే సమయంలో పెద్ద డ్రాగన్ రెడ్ డెత్ గ్రామంపై దాడి చేస్తుంది. దీంతో హికప్, టూత్‌లెస్, అతని స్నేహితులు కలిసి ఆ భయంకర డ్రాగన్‌ను ఓడిస్తారు. ఆపై వీరు చేసిన సాహాసానికి అక్కడి వారు తమ తప్పు తెలుసుకుని చివరకు నైట్ ఫ్యూరీ డ్రాగన్స్ తో కలిసి జీవించడం ప్రారంభిస్తారు.
ఇప్పుడీ సినిమా అమోజాన్ ప్రైమ్, యాపిల్ టీవీ ఫ్లస్ వంటి ఓటీటీల్లో స్ట్రీమింగ్‌కు వచ్చింది. ఇంగ్లీష్, హిందీ బాషల్లో అందుబాటులో ఉండగా త్వరలో ఇతర భాషల్లోనూ తీసుకు రానున్నారు. అయితే ఈ సినిమా రెంట్ పద్దతిలో మాత్రమే ప్రస్తుతానికి ఎవలెబుల్‌గా ఉంది. అంటే డబ్బు కట్టి ఈ సినిమాను వీక్షించాలి. ఓ పది రోజుల తర్వాత ఫ్రీగా అందుబాటులోకి వస్తుంది. పిల్లు, పెద్దలు ఎవరైనా, ఏ వయసు వారైనా హ్యాపీగా, ఇంటిల్లా పాది కలిసి కూర్చోని ఈ సినిమాను ఆస్వాదించవచ్చు. ఎక్కడా ఉలాంటి అసభ్యకర సన్నివేశాలు లేవు. ఇదిలాఉంటే.. సుమారు 150 మిలియన్ డాలర్లకు (రూ.1245 కోట్లు) పైగా ఖర్చుతో నిర్మించిన ఈ హౌ టు ట్రెయిన్ యువర్ డ్రాగన్ (How to Train Your Dragon) చిత్రం రిలీజైన నాలుగు రోజుల్లోనే వారు పెట్టిన పెట్టుబడికి మించి 200 మిలియన్ డాలర్ల (రూ.1710 కోట్లు) వరకు రాబట్టి ప్రపంచ బాక్సాపీస్‌ను షేక్ చేసింది. థియేటర్లలో రన్ ముగిసే సమయానికి విశ్వ వ్యాప్తంగా 562 మిలయన్ డాలర్లను కొల్లగొట్టింది. అంటే రూపాయల్లో చెప్పాలంటే అక్షరాల రూ.4665 వేల కోట్లను సాధించింది. ఈ యేడు హాయ్యస్ట్ గ్రాసర్ చిత్రాల్లో టాప్ 5లో ఒక సినిమాగా చోటు సంపాదించుకుంది.