Love Returns: భార్య, ప్రియురాలు.. ఒకే ఇంటిలో ఉంటే! అదిరిపోయే యూట్యూబ్ మినీ సిరీస్
ABN, Publish Date - Aug 06 , 2025 | 04:01 PM
ప్రముఖ ఆడియో కంపెనీ సరిగమ నిర్మాణంలోకి అడుగుపెట్టి, తొలిసారిగా ‘లవ్ రిటర్న్స్ పేరుతో నిర్మించిన సిరీస్ ‘లవ్ రిటర్న్స్.
ప్రముఖ ఆడియో కంపెనీ సరిగమ (Saregama) యూట్యూబ్ మినీ సిరీస్ నిర్మాణంలోకి అడుగుపెట్టి, తొలిసారిగా ‘లవ్ రిటర్న్స్ (Love Returns) పేరుతో ఈ లఘు చిత్ర సిరీస్ నిర్మించింది. మొత్తం 12 ఎపిసోడ్లుగా రూపొందించిన ఈ మినీ సిరీస్‌లో బుల్లితెర సీరియల్ ఫేం చైత్ర రెడ్డి (Chaitra Reddy), ‘కన కానుమ్ కాలంగల్-2’ ఫేం ఫర్వీన్ (Parveen), ‘ఆఫీస్’ సీరియల్‌లో హీరోగా నటించిన గురు లక్ష్మణ్ (Gurulakshman) ప్రధాన పాత్రలు పోషించారు.
తాజాగా విడుదల చేసిన ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ సిరీస్ ఆగస్టు 7వ తేదీ సాయంత్రం 7 గంటల నుంచి సరిగమ డైస్ తమిళ్(Saregama Dice (TV Shows) Tamil) యూ ట్యూబ్ ఛానల్‌లో కేవలం తమిళంలో మాత్రమే అందుబాటులోకి రానుంది. తెలుగులో మాత్రం లేదు.
ఈ నెల 7వ తేదీ నుంచి నుంచి ప్రసారమయ్యే ఈ షార్ట్ సిరీస్‌ను సరిగమ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రిన్స్ ఇమ్మాన్యుయేల్ నిర్మించారు. సదాశివం సెంథిల్‌రాజన్ (Sadhasivam Senthilrajan), అర్జున్ డీవీ (Arjun DV) అనే ఇద్దరు డైరెక్టర్లు దర్శకత్వం వహించారు. ఈ కథను దర్శక ద్వయం వివరిస్తూ, ‘ఒకే ఇంటిలో భార్య, మాజీ ప్రియురాలు ఉండగా, ఆ సమయంలో ఆఫీస్ స్నేహితులు ఇంటికి వస్తే ఏం జరుగుతుంది. భార్య, ప్రియురాలి మధ్య చిక్కుకున్న భర్త పరిస్థితి ఎలా ఉంటుంది? వంటి అంశాలను ఆసక్తికరంగా తెరకెక్కించాం’ అని వివరించారు.