Kantara Chapter 1: సినిమాకు ప్రాణంగా నిలిచిన బ్రహ్మ కలశ వీడియో సాంగ్ వచ్చేసింది..
ABN, Publish Date - Oct 08 , 2025 | 08:20 PM
కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి (Rishab Shetty) హీరోగా నటించి దర్శకత్వం వహించిన కాంతార చాప్టర్ 1 (Kantara Chapter 1) అక్టోబర్ 2 న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది.
Kantara Chapter 1: కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి (Rishab Shetty) హీరోగా నటించి దర్శకత్వం వహించిన కాంతార చాప్టర్ 1 (Kantara Chapter 1) అక్టోబర్ 2 న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) హీరోయిన్ గా నటించిన ఈ సినిమా రికార్డ్ కలక్షన్స్ రాబట్టి అన్ని భాషల్లో విజయ ఢంకా మోగించింది. ఇక కన్నడ స్టార్ అందరూ రిషబ్ శెట్టిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ఫుల్ ఆక్యుపెన్సీతో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ మరింత ప్రమోషన్స్ చేయడం మొదలుపెట్టారు.
మొదటి నుంచి రిషబ్ శెట్టి ఈ సినిమాకు ఎక్కువ ప్రమోషన్స్ చేయలేకపోయాడు. దానికి కారణం ఈ సినిమా వివాదంలో చిక్కుకోవడమే. కన్నడలో తెలుగు సినిమాలు రిలీజ్ కానివ్వలేదని.. ఇక్కడ కాంతారను బ్యాన్ చేయాలనీ పలువురు ట్రెండ్ చేశారు. అంతే కాకుండా రిషబ్ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కన్నడ మాట్లాడాడని కూడా విమర్శలు వెల్లువెత్తాయి. ఇక ఆ విమర్శలన్నింటిని రిషబ్.. ఒక్క హిట్ తో పక్కకు నెట్టాడు. సినిమా బావుండడంతో తెలుగువారు కూడా థియేటర్ కు వెళ్లి చూస్తున్నారు.
ఇక ఇప్పుడు మేకర్స్ కాంతారా చాప్టర్ 1 నుంచి బ్రహ్మ కలశ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. కాంతారకు వరాహ రూపం సాంగ్ ఎంత ప్రాణమో.. చాప్టర్ 1 కి బ్రహ్మ కలశ సాంగ్ ప్రాణం లాంటింది. శివ భక్తిని లిరిక్స్ లోనే కాదు.. విజువల్స్ లో కూడా ఎంతో అద్భుతంగా చూపించారు. తెలియదు శివుడా భక్తి మార్గం అంటూ మొదలైన ఈ సాంగ్ ఆద్యంతం కన్నుల పండగగా ఉంటుంది. ఇంతకన్నా గొప్పగా తమ కల్చర్ ను ఇంకెవరు చూపించలేరు అంటే ఆశ్చర్యపోనవసరం లేదు.
కృష్ణ కాంత్ అందించిన లిరిక్స్ అయితే మహాద్బుతమని చెప్పాలి. ఆ శివుడి గురించి.. ఆయన చూపించే ప్రేమ గురించి ఎంతో గొప్పగా రాశారు. ఇక ఆ లిరిక్స్ కు వరాహ రూపం థీమ్ తోనే అంజనీష్ అందించిన మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్. వీటికి తోడు రిషబ్ టేకింగ్, ఆ విజువల్స్ థియేటర్ లో ఈ సాంగ్ వస్తున్నంతసేపు ప్రతి ఒక్కరు భక్తి పారవశ్యంలో మునిగిపోవడం ఖాయమని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఈ వీడియో సాంగ్ అనంతరం కాంతారను థియేటర్ లో వీక్షించాలనే కోరిక ప్రేక్షకుల్లో కలుగుతుందేమో చూడాలి.
Kalyani Priyadarshan: లోక తరువాత ఇలానా.. ఛఛ అస్సలు ఊహించలేదే
Ari: ‘హనుమాన్’, ‘మిరాయ్’ బాటలో ‘అరి’.. అంచనాలు పెంచేశారే