సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Kantara Chapter 1: తెలీదు శివుడా భక్తి మార్గం.. వరాహరూపం సాంగ్ ను మించి ఉందిగా

ABN, Publish Date - Sep 28 , 2025 | 05:24 PM

కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి (Rishab Shetty) హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం కాంతార చాఫ్టర్ 1 (Kantara Chapter 1).

Kantara Chapter 1

Kantara Chapter 1: కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి (Rishab Shetty) హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం కాంతార చాఫ్టర్ 1 (Kantara Chapter 1). ఇప్పటికే రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకున్న కాంతారకు ప్రీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక ఈ చిత్రంలో రిషబ్ సరసన రుక్మిణి వసంత్ నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా హైప్ కూడా క్రియేట్ చేసింది.


దసరా కానుకగా అక్టోబర్ 2 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ నేడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్ కు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా విచ్చేస్తున్నాడు. ఇక ఇదే హైప్ అనుకుంటే.. తాజాగా ఈ సినిమా నుంచి బ్రహ్మా కలశ అంటూ సాగే ఆడియో సాంగ్ ను రిలీజ్ చేశారు.


సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. కాంతారలో వరాహరూపం సాంగ్ ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సెన్సేషన్ తో పాటు వివాదాలను కూడా తీసుకొచ్చిపెట్టింది. కానీ, ఇప్పటికీ ఆ సాంగ్ వింటే గూస్ బంప్స్ ఖాయం అని చెప్పాలి. ఇక ఇప్పుడు బ్రహ్మా కలశ సాంగ్ కూడా వరాహరూపం థీమ్ తోనే రావడం విశేషం. తెలీదు శివుడా భక్తి మార్గం.. గుండెల నిండా నువ్వు దైవరూపం అంటూసాగిన లిరిక్స్ భక్తి పారవశ్యంలో ముంచెత్తుతున్నాయి. అంజనీష్ లోకనాథ్ మరోసారి తన సంగీతంతో ప్రేక్షకులను మరో లోకంలోకి తీసుకెళ్లాడు. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ లో వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో రిషబ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Chiranjeevi: చరణ్@18.. ఎమోషనల్ అయిన చిరు

Hridayapoorvam: ఓటీటీలో.. అద‌ర‌గొడుతున్న మ‌ల‌యాళ‌ లేటెస్ట్ ఫ్యామిలీ డ్రామా

Updated Date - Sep 28 , 2025 | 05:24 PM