Chiranjeevi: చరణ్@18.. ఎమోషనల్ అయిన చిరు
ABN , Publish Date - Sep 28 , 2025 | 04:06 PM
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అదే పుత్రోత్సాహాన్ని అనుభవిస్తున్నారు. ఆయన వారసుడిగా రామ్ చరణ్ (Ram Charan).. చిరుత సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు.
Chiranjeevi: పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు జనులా.. పుత్రుని కనుగొని పొగడగ.. పుత్రోత్సాహము నాడు పొందుర సుమతీ అని ఒక పద్యం ఉంటుంది. దానికి అర్ధం.. తండ్రికి కుమారుడు పుట్టగానే... సంతోషం కలుగదు. మంచి సంస్కారవంతంగా అతడు ఎదిగి, పదిమందిచేత మంచివాడని అనిపించుకున్న రోజునే ఆ తండ్రికి నిజమైన సంతోషం కలుగుతుందని.. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అదే పుత్రోత్సాహాన్ని అనుభవిస్తున్నారు. ఆయన వారసుడిగా రామ్ చరణ్ (Ram Charan).. చిరుత సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు.
చిరంజీవి కుమారుడు చరణ్ గా మొదలైన అతని ప్రస్థానం నేడు చరణ్ తండ్రి చిరంజీవి అని చెప్పుకొనేవరకు వచ్చింది. చరణ్ తన కెరీర్ మొదలుపెట్టి 18 ఏళ్లు పూర్తయ్యాయి. నేడు చిరుత సినిమా రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. చిరు కొడుకు అని సినిమా చూడడమే తప్ప అతనిలో ఒక్క ఎక్స్ ప్రెషన్ కూడా లేదు అన్న ట్రోల్స్ నుంచి హీరో అంటే ఇతనే అనేవరకు చరణ్ ఎదిగాడు. ఇక నేటితో ఇండస్ట్రీలో 18 ఏళ్లు పూర్తి చేసుకున్న చరణ్ కు అభిమానులు, సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
తాజాగా చిరు సైతం తన కొడుకు ఎదుగుదలను చూసి గత్వాపడుతున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. పుత్రోత్సాహంతో పొంగిపోతున్నట్లు చెప్పుకొచ్చారు. ' చరణ్ బాబు, 18 ఏళ్ల క్రితం ‘చిరుత’తో మొదలైన నీ సినీ ప్రయాణం, నేడు కోట్లాది అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచినందుకు ఎంతగానో సంతోషిస్తున్నాను. నిన్ను తెరపై హీరోగా చూసిన ఆ క్షణం.. నాన్నగా నేను ఎప్పటికీ మరచిపోలేను. నీ క్రమశిక్షణ, కృషి, పట్టుదల, వినయం, అంకితభావం నిన్ను ఇండస్ట్రీలో మరింత ప్రత్యేకంగా నిలబెట్టాయి. తండ్రిగా నేను నిన్ను చూసి ఎప్పుడు గర్వపడుతుంటా.. తెలుగు ప్రేక్షకుల అభిమానంతో, దేవుని దీవెనలతో మరెన్నో శిఖరాలు నువ్వు అధిరోహించాలి అని కోరుకుంటూ.. విజయోస్తు' అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.
Thaali Kattu Subhavela: గ్రామీణ శైలిని ప్రతిబింబించే 'తాళికట్టు శుభవేళ'
Chandrababu Naidu: పవన్ కళ్యాణ్.. త్వరగా కోలుకోవాలి