సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Benz: లోకేష్ యూనివర్స్ లోకి కొత్త విలన్ గా మరో స్టార్ హీరో

ABN, Publish Date - Jun 04 , 2025 | 06:55 PM

రాఘవ లారెన్స్ హీరోగా బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం బెంజ్ (Benz).

Benz

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) అక్కడ ఎంత ఫేమసో.. ఇక్కడ కూడా అంతే ఫేమస్. ఖైదీ(Khaidi) సినిమాతో తెలుగువారి మనసులకు దగ్గరయ్యిన లోకేష్.. విక్రమ్  సినిమాతో తెలుగులో కూడా మంచి డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు.   లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో  ఖైదీ, విక్రమ్(Vikram), లియో  సినిమాలను తెరకెక్కించి ఒక హైప్ క్రియేట్ చేశాడు.  ప్రస్తుతం ఈ యూనివర్స్ లో రోలెక్స్(Rolex), ఖైదీ 2 సినిమాలు  లైన్లో ఉన్నాయి. 

 

 

లోకేష్ సినిమాలలో  హీరోలుగా చేసేది హీరోలే.. విలన్ గా చేసేది కూడా హీరోలే.  విక్రమ్ లో సూర్య(Suriya), విజయ్ సేతుపతి(Vijay Sethupathi) విలన్స్ గా నటించారు. ఇప్పుడు కూలీలో నాగార్జున(Nagarjuna) కూడా విలన్ గానే నటిస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక తాజాగా లోకేష్ యూనివర్స్ లోకి కొత్త విలన్ వచ్చి చేరాడు. ప్రస్తుతం లోకేష్ ఒకపక్క డైరెక్టర్ గానే కాకుండా నిర్మాతగా కూడా మారి సినిమాలను నిర్మిస్తున్న విషయం తెల్సిందే. 

 

రాఘవ లారెన్స్ హీరోగా బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం బెంజ్ (Benz). ఈ సినిమాను లోకేష్ తో కలిసి సుధన్ సుందరం,  జగదీష్ పళనిసామి నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో మరో మలయాళ స్టార్ హీరో నివిన్ పౌలి(Nivin Pauly) నటిస్తున్నాడు. ప్రేమమ్ సినిమాతో నివిన్ తెలుగువారికి కూడా సుపరిచితుడే. తాజాగా  బెంజ్ క్యారెక్టర్స్ లో మొదటివాడు వాల్టర్ అని మేకర్స్ నివిన్  గ్లింప్స్ ను రిలీజ్ చేశారు.

 

Also Read: Rana Daggubati: ఫొటోగ్రాఫర్లపై మండిపడ్డ రానా.. 

 

వీడియో మొత్తం రక్తంతో నింపేశారు. నివిన్ ఎవరినో బాగా  కొట్టి.. సుత్తి తీసుకొచ్చి, దానికి ఉన్న రక్తాన్ని తుడుస్తూ బంగారు  పళ్లతో నవ్వుతూ కనిపించాడు.  అతని గెటప్ చూస్తుంటే.. లోకేష్ అంతకుముందు తీసిన విక్రమ్ సినిమాలో సంతానంకు బంధువుగా కనిపిస్తున్నాడు. ఒంటినిండా బంగారు చైన్లు, ఆ జుట్టు కొత్తగా కనిపించాడు. 

ఇంకోపక్క మరో గెటప్ లో ఉన్న నివిన్.. బెంజ్ అని పేరు చెప్పడం.. ఎదురుగా ఉన్న మరో నివిన్ పేరు అడగడం.. అతను వాల్టర్ అనిచెప్పుకొచ్చాడు. చివర్లో డర్టీ మైండ్.. బ్యూటీఫుల్ హార్ట్.. డెడ్లీ కాంబినేషన్ అంటూ నివిన్ చెప్పిన డైలాగ్ హైలైట్ గా నిలిచింది. గత కొంతకాలంగా నివిన్ పరాజయాలానే అందుకుంటున్నాడు. మరి ఈ విలన్ రోల్ తో నివిన్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి. 

Updated Date - Jun 04 , 2025 | 06:56 PM