Arjun Das: అర్జున్ దాస్ ప్రేమలో ఐశ్వర్య లక్ష్మి
ABN, Publish Date - Aug 23 , 2025 | 06:51 PM
కోలీవుడ్‌లోని విలక్షణ నటుడు అర్జున్ దాస్‌తో యంగ్ హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్నట్టు కోడంబాక్కం వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.
కోలీవుడ్‌లోని విలక్షణ నటుడు అర్జున్ దాస్‌తో (Arjun Das) యంగ్ హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి (Aishwarya Lakshmi) పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్నట్టు కోడంబాక్కం వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. గతంలో ఇదే తరహా గుసగుసలు వినిపించగానే వాటిని అర్జున్ దాస్ ఖండించారు. ఐశ్వర్య లక్ష్మి కూడా తామిద్దరం మంచి స్నేహితులమంటూ వివరణ ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఈ తరహా ప్రచారం జోరుగా సాగుతోంది. దీనికి కారణం లేకపోలేదు.
ALSO READ: Mayasabha - Ormax: ఓర్మాక్స్ లో రికార్డు సృష్టించిన తొలి తెలుగు సిరీస్‌గా..
‘కాదలిల్ సొదుప్పదు ఎప్పడి’ ఫేం బాలాజీ మోహన్ దర్శకత్వంలో రూపుదిద్దుకునే ఒక వెబ్ సిరీస్ లో వీరిద్దరూ కలిసి నటిస్తుండటమే దీనికి కారణం. నిప్పు లేకుండా పొగ రాదన్న సామెతను ప్రస్తావిస్తూ, వీరిద్దరూ ప్రేమలో ఉండటం వల్లే కలిసి వెబ్ సిరీ్‌సలో నటించారంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. సినిమాల్లోకి అడుగుపెట్టకముందు బ్యాంకు ఉద్యోగిగా, రేడియో జాకీగా అర్జున్ దాస్ పనిచేశారు. ఐశ్వర్య లక్ష్మి మాత్రం వైద్య విద్య పూర్తి చేశారు. ఆ తర్వాత వీరిద్దరూ సినిమాల్లో అడుగుపెట్టి విజయవంతంగా తమ కెరీర్‌ను కొనసాగిస్తున్నారు.
ALSO READ: Vidya balan: విద్యాబాలన్ తొలి సినిమా.. 20 ఏళ్ల తర్వాత మళ్లీ..
Ramajogayya Sastry: రంజింప చేస్తోన్న రామజోగయ్య శాస్త్రి