Mayasabha - Ormax: ఓర్మాక్స్ లో రికార్డు సృష్టించిన తొలి తెలుగు సిరీస్‌గా..
ABN , Publish Date - Aug 23 , 2025 | 06:35 PM
‘మయసభ: రైజ్ ఆఫ్ టైటాన్స్’ దేశ వ్యాప్తంగా ఓటీటీ వీక్షకులను అలరిస్తోంది. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సిరీస్. విడుదలైన వారానికి గానూ ఓర్మాక్స్ మీడియా ఓ సర్వేని వెల్లడించింది.
‘మయసభ: రైజ్ ఆఫ్ టైటాన్స్’ దేశ వ్యాప్తంగా ఓటీటీ వీక్షకులను అలరిస్తోంది. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సిరీస్. విడుదలైన వారానికి గానూ ఓర్మాక్స్ మీడియా ఓ సర్వేని వెల్లడించింది. భారతదేశంలో అత్యధికంగా వీక్షించబడిన స్ర్టీమింగ్ షోల జాబితాలో ‘మయసభ’ 3వ స్థానంలో ఉందని ఓర్మాక్స్ ప్రకటించింది. ఇప్పటికే ఈ సిరీస్ 2.8 మిలియన్ల వీక్షణలతో పాన్-ఇండియా వైడ్‌గా సంచలనం సృష్టించింది. భాషా సరిహద్దుల్ని చెరిపేస్తూ అన్ని ప్రాంతాల ప్రేక్షకులను ‘మయసభ’ మెప్పిస్తోంది. ఇలాంటి రికార్డు సృష్టించిన తొలి తెలుగు సిరీస్‌గా మయసభ నిలిచింది.
దేవా కట్టా, కిరణ్ జే కుమార్ సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో కాకర్ల కృష్ణమ నాయుడిగా ఆది పినిశెట్టి, ఎంఎస్ రామి రెడ్డిగా చైతన్య రావు ప్రయాణాన్ని అందరూ చూసి ఆశ్చర్యపోయారు. వారిద్దరి మధ్య ఏర్పడిన బంధం, స్నేహంతో వేసిన అడుగులు, వారి గమ్యం, లక్ష్యం, రాజకీయ చదరంగం ఇలా అన్నీ కూడా ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నాయి. ఈ సిరీస్‌లో దివ్య దత్తా, సాయికుమార్, నాజర్, శత్రు, రవీంద్ర విజయ్, తాన్య రవిచంద్రన్ వంటి తారలు నటించారు.