సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Anupama parameswaran : జీవితాన్ని పూర్తిగా మార్చేసిన సినిమా

ABN, Publish Date - Aug 21 , 2025 | 09:17 AM

మారి సెల్వరాజ్‌ దర్శకత్వంలో ధృవ్‌ విక్రమ్‌ హీరోగా నటిస్తున్న ‘బైసన్‌’ చిత్రం తన జీవితాన్ని పూర్తిగా మార్చివేసిందని ఆ చిత్ర హీరోయిన్‌ అనుపమ పరమేశ్వరన్‌ అన్నారు.

మారి సెల్వరాజ్‌ దర్శకత్వంలో ధృవ్‌ విక్రమ్‌ హీరోగా నటిస్తున్న ‘బైసన్‌’ చిత్రం తన జీవితాన్ని పూర్తిగా మార్చివేసిందని ఆ చిత్ర హీరోయిన్‌ అనుపమ పరమేశ్వరన్‌ అన్నారు. ఈ విషయంపై ఆమె మాట్లాడుతూ... ‘పరియేరుమ్‌ పెరుమాళ్‌’ కోసం దర్శకుడు మారి సెల్వరాజ్‌ మొదట నన్నే సంప్రదించారు. ఆ సమయంలో నేను పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉండటంతో అవకాశాన్ని వదులుకున్నా. మంచి చిత్రంలో నటించలేకపోయాననే బాధ ఇప్పటికీ ఉంది. ఆ తర్వాత ‘మామన్నన్‌’లో కూడా ముఖ్య పాత్రకు అవకాశం వచ్చినప్పటికీ నటించలేకపోయా.

చివరగా ‘బైసన్‌’తో నా కల నెరవేరింది. మారి సెల్వరాజ్‌ కెరీర్‌లోనే మంచి చిత్రంగా ఇది నిలుస్తుంది. ఆయన టేకింగే భిన్నం. ఇప్పటివరకు ఏ ఒక్క చిత్రానికీ శిక్షణ తీసుకున్నది లేదు. కానీ, ‘బైసన్‌’ కోసం రెండు నెలల పాటు శిక్షణ తీసుకున్నారు. చిత్రీకరణ జరిగే గ్రామానికి వెళ్లి ఆ గ్రామ ప్రజలతో మమేకమైపోయాను. ఈ అనుభవం నా జీవితాన్నే మార్చివేసింది. ఇపుడు కమిట్‌ అయ్యే అన్ని చిత్రాల్లో బోల్డ్‌గా నటిస్తున్నా. దీనికి కారణం బైసన్‌ చిత్ర అనుభవమే’ అని అనుపమ పరమేశ్వరన్‌ వెల్లడించారు.

ALSO READ: Salakaar: ఇండో - పాక్ సంబంధాలపై మరో వెబ్ సీరిస్

Chiru - Megs Blast: విశ్వంభర.. చిరంజీవి మరో లీక్‌ ఇచ్చారు..

Updated Date - Aug 21 , 2025 | 08:07 PM