Lokesh Kanagaraj: హీరోగా మారుతున్న మరో దర్శకుడు
ABN , Publish Date - May 06 , 2025 | 03:29 PM
ప్రముఖ తమిళ దర్శకుడు లోకేశ్ కనకరాజ్ త్వరలో కెమెరా ముందుకు హీరోగా రాబోతున్నాడనే వార్త కోలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. ఙందులో వాస్తవం ఎంత ఉందనేది పక్కన పెడితే... అతని అభిమానులు మాత్రం ఈ వార్తను భలే ఎంజాయ్ చేస్తున్నారు.
ప్రముఖ తమిళ దర్శకుడు లోకేష్ కనకరాజ్ (Lokesh Kanagaraj) కు పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అతని అభిమానులు కేవలం తమిళనాడులో కాదు... ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. తెలుగులోనూ లోకేష్ కనకరాజ్ మూవీస్ డబ్ అయ్యి విడుదలైనప్పుడు... ఎవరు హీరో అనే దానిని పట్టించుకోకుండా అతని కోసం థియేటర్లకు వెళుతుంటారు. ముఖ్యంగా యూత్ ను ఆకట్టుకోవడంతో లోకేష్ కనకరాజ్ ది అందె వేసిన చేయి. తమిళ సినిమా రంగంలో లోకేష్ కనకరాజ్ సినిమా యూనివర్శ్ కు ఉన్న క్రేజ్ ఇంతా అంతా కాదు. ప్రస్తుతం లోకేష్ కనకరాజ్... సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) హీరోగా 'కూలీ' (Coolie) మూవీని తెరకెక్కిస్తున్నాడు. అందులో కింగ్ నాగార్జున (Nagarjuna) సైతం కీలక పాత్రను పోషిస్తున్నాడు. శుత్రీహాసన్ (Shruthi Haasan), పూజా హెగ్డే (Pooja Hegde), ఉపేంద్ర తదితరులు ఇందులో నటిస్తున్నారు. ఆగస్ట్ 14న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. అలానే లోకేష్ కనకరాజ్ దీని తర్వాత కార్తీ (Karthi) తో 'ఖైదీ' (Khaidi) సీక్వెల్ చేయబోతున్నాడు. ఈ రెండు సినిమాలకూ విపరీతమైన క్రేజ్ నెలకొంది.
ఇదిలా ఉంటే... ఇప్పుడో వార్త కోలీవుడ్ లో వైరల్ గా మారింది. అది లోకేష్ కనకరాజ్ అభిమానులను ఆనంద డోలికల్లో ముంచెత్తుతోంది. లోకేశ్ కనకరాజ్ త్వరలోనే కెమెరా ముందుకు హీరోగా రాబోతున్నాడట. అదే జరిగితే... దర్శకుల నుండి హీరోగా మారి తమకుంటూ ఓ చిత్రసీమలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న వారి జాబితాలోకి లోకేష్ కూడా చేరిపోతాడు. భాగ్యరాజా, సుందర్ సి వంటి దర్శకులు టాప్ పొజిషన్ లో ఉన్న సమయంలోనే నటనవైపుకు వచ్చి హీరోలుగా రాణించారు. సంతానభారతి, భారతీ రాజా, కె. ఎస్. రవికుమార్, మిస్కిన్ వంటి వారు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారిపోయారు. దర్శకులు... నటులు కావడం కామన్ అయినా... హీరోలుగా రాణించిన వారు తక్కువనే చెప్పాలి. ఈ మధ్య కాలంలో అలా రాణిస్తున్న వ్యక్తి ప్రదీప్ రంగనాథన్! ఈ యువ దర్శకుడి తరహాలోనే క్రేజీ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కూడా హీరో అయితే సంతోషమే. అయితే... లోకేశ్ హీరోగా నటించే సినిమా అధికారిక ప్రకటన ఏదీ రాకపోయినా... వచ్చే యేడాది అది విడుదల కావచ్చునని అంటున్నారు.
Also Read: Pawan Kalyan: వీరమల్లు వెనుక ముగ్గురు దర్శకులు
Also Read: Varun - Lavanya: జీవితంలో అత్యంత అందమైన పాత్ర.. కమింగ్ సూన్
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి