Varun - Lavanya: జీవితంలో అత్యంత అందమైన పాత్ర.. కమింగ్‌ సూన్‌

ABN , Publish Date - May 06 , 2025 | 01:00 PM

కొణిదెల ఫ్యామిలీలోకి వారసుడో, వారసురాలో రాబోతున్నారు. నాగబాబు త్వరలో తాతయ్య కాబోతున్నారు.

కొణిదెల ఫ్యామిలీలోకి వారసుడో, వారసురాలో రాబోతున్నారు. నాగబాబు త్వరలో తాతయ్య కాబోతున్నారు. వరుణ్‌ తేజ్‌(Varun Tej) - లావణ్యత్రిపాఠి (Lavanya Tripati)దంపతులు అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. తల్లిదండ్రులు కానున్నట్లు తెలుపుతూ ఓ ఫొటో సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘జీవితంలో అత్యంత అందమైన పాత్ర పోషించనున్నాను. కమింగ్‌ సూన్‌’ అని వరుణ్‌ తేజ్‌ పోస్ట్  పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ వైరల్‌ అవుతుండగా సినీ ప్రముఖులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సమంత, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, అల్లు స్నేహా కంగ్రాట్స్‌ అంటూ రిప్లైలు పెట్టారు. (Lavanya pregnancy news Viral)

 ‘మిస్టర్‌’ సినిమాలో వరుణ్‌ - లావణ్య(Lavanya Tripathi) తొలిసారి జంటగా నటించారు. అప్పుడే ఇద్దరూ స్నేహితులయ్యారు. తదుపరి  ‘అంతరిక్షం’లోనూ  యాక్ట్ చేసి మెప్పించారు.  2023 నవంబర్‌ 2న ఇటలీలోని టస్కానీ వేదికగా వీరిద్దరూ వివాహబంధంతో ఒక్కటయ్యారు. 

 

Updated Date - May 06 , 2025 | 01:00 PM