సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Eko- Annapurna Studio: అదిరిపోయే.. మ‌ల‌యాళ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌! తెలుగులోకి.. తెస్తున్న 'అన్న‌పూర్ణ‌'

ABN, Publish Date - Nov 18 , 2025 | 05:03 PM

మలయాళ చిత్రం EKO ను రెండు తెలుగు రాష్ట్రాలలో అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ విడుదల చేస్తోంది. ఈ సినిమా నవంబర్ 21న జనం ముందుకు వస్తోంది.

EKO Malayalam Movie

నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswara Rao) నెలకొల్పిన అన్నపూర్ణ స్టూడియోస్ (Annapurna Studios) ఆయన తదనానంతరం ఇవాళ్టికీ తన హద్దులను విస్తరిస్తూ ముందుకు సాగుతోంది. సినిమా నిర్మాణం, పంపిణీ తో పాటు ఫిల్మ్ స్కూల్ నూ నిర్వహిస్తున్నారు నాగార్జున (Nagarjuna). విశేషం ఏమంటే... యానిమేషన్, విఎఫ్ఎక్స్, సౌండ్ సిస్టమ్ లోనూ అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణానంతర కార్యకలాపాలను ఇంటర్నేషనల్ క్వాలిటీతో అందిస్తోంది.

ఇప్పటికే పలు తెలుగు, పరభాషా అనువాద చిత్రాలను అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ తెలుగులో పంపిణీ చేసింది. అయితే మొదటిసారి ఈ సంస్థ తెలుగేతర చిత్రాన్ని కూడా తెలుగు రాష్ట్రాలలో పంపిణీ చేస్తుండటం విశేషం. మలయాళంలో రూపుదిద్దుకున్న మిస్టరీ థ్రిల్లర్ మూవీ 'ఎకో' (EKO) ను అన్నపూర్ణ స్టూడియోస్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ నెల 21న విడుదల చేయబోతోంది.


కేరళలోని పర్వత సానువుల్లో రూపుదిద్దుకున్న 'ఎకో' మూవీలో కురియచన్ గా సందీప్ ప్రదీప్ నటించాడు. ఇతర ప్రధాన పాత్రలను వినీత్, నారాయన్, బిను పప్పు, అశోకన్, బైనా మొమిన్, సిమ్ ఝీ ఫీ, ఎన్.జి. హెంగ్ షీన్, షాహిర్ మహమ్మద్, రంజిత్ శేఖర్ పోషించారు. దీన్ జిత్ అయ్యతన్ దర్శకత్వం వహించిన 'ఎకో' చిత్రాన్ని ఎం.ఆర్.కె. జయరామ్ నిర్మించాడు. ముజీబ్ మజీద్ ఈ సినిమాకు సంగీతం అందించారు. మలయాళ చిత్రం 'ఎకో'ను రెండు తెలుగు రాష్ట్రాలలో విడుదల చేయడం ఎంతో ఆనందంగా ఉందని అన్నపూర్ణ స్టూడియోస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుప్రియ యార్లగడ్డ తెలిపారు.

Also Read: Sara Arjun: బ్యాక్ టు బ్యాక్ క్రేజీ మూవీస్

Also Read: Kayadu Lohar: టాస్మాక్ స్కామ్.. హద్దులు దాటారు

Updated Date - Nov 18 , 2025 | 06:03 PM