Ajith Kumar: భారతీయ సినిమాను ఇలా కూడా ప్రమోట్ చేయొచ్చు..
ABN, Publish Date - Oct 04 , 2025 | 09:15 AM
భారతీయ సినిమాను ప్రమోట్ చేయడానికి సాధారణంగా ఫిల్మ్ ఫెస్టివల్స్, ప్రీమియర్స్, ఇంటర్వ్యూలే ఎక్కువగా వాడతారు. కానీ, క్రీడలతో (ప్రత్యేకంగా అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకాదరణ పొందే మోటార్ రేసింగ్‌తో కలిపి ప్రమోట్ చేయడం కాస్త కొత్త ఆలోచన అనే చెప్పాలి.
భారతీయ సినిమాను (Indian Cinema Industry) ప్రమోట్ చేయడానికి సాధారణంగా ఫిల్మ్ ఫెస్టివల్స్, ప్రీమియర్స్, ఇంటర్వ్యూలే ఎక్కువగా వాడతారు. కానీ, క్రీడలతో (ప్రత్యేకంగా అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకాదరణ పొందే మోటార్ రేసింగ్‌తో (motor racing) కలిపి ప్రమోట్ చేయడం కాస్త కొత్త ఆలోచన అనే చెప్పాలి. కోలీవుడ్ అగ్రహీరో అజిత్ కుమార్ ఇలాంటి ఆలోచనే చేశారు. ‘అజిత్ కుమార్ (Ajith kumar) కార్ రేసింగ్’ అనే కంపెనీ స్థాపించి అంతర్జాతీయ కార్ రేసింగ్ పోటీల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో తన కార్ రేసింగ్ కంపెనీ లోగోలో ‘ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ’ అనే పేరు ముద్రించారు. భారతీయ చిత్రపరిశ్రమకు అంతర్జాతీయ వేదికలపై మరింత ప్రచారం కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అజిత్ వెల్లడించారు. ప్రస్తుతం స్పెయిన్‌లోని బార్సిలోనాలో జరుగుతున్న కార్ రేసింగ్‌లో అజిత్ బృందం పాల్గొంటుంది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘మున్ముందు మరిన్ని కార్ రేసింగ్ పోటీల్లో పాల్గొనేందుకు ప్రయత్నిస్తాం. ఇందుకోసం క్రీడలు, భారతీయ చలనచిత్ర పరిశ్రమకు ప్రాముఖ్యత ఇచ్చేలా సారూప్యత కలిగిన వ్యక్తులను గుర్తించాలి. ఒక సినిమాను ప్రోత్సహించడానికి అనేక మార్గాలున్నాయి. ఫార్ములా రేసింగ్, కార్ రేసింగ్ లాంటి ఈవెంట్స్ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వీక్షిస్తారు. అలాంటి ఈవెంట్స్‌లో 'ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ' అనే లోగో కనిపిస్తే, అది భారతీయ సినిమాకు ఒక అంతర్జాతీయ గుర్తింపుగా మారుతుంది.ఇందుకోసం మోటార్ రేసింగ్ పోటీలను ఉపయోగించుకోవాలని భావిస్తున్నాను. ఇలా చేయడం వల్ల అంతర్జాతీయ స్థాయిలో భారీ సంఖ్యలో ప్రేక్షకులను ఆకర్షించవచ్చు. అలాగే, ప్రపంచవ్యాప్తంగా భారతీయ చిత్రాలకు కూడా ఆదరణ లభించాలని కోరుకుంటున్నాను’ పేర్కొన్నారు. అజిత్ లాంటి స్టార్ ఇలాంటి ఐడియాను అమలు చేస్తే, ఇతర ఇండస్ట్రీలు కూడా ఇలా ప్రమోషన్ టెక్నిక్స్ వాడే అవకాశముంది.
ALSO READ: Raviteja: రవితేజ అనార్కలి.. పేరు మారిందా?
Vijay Rashmika Engagement: విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నా నిశ్చితార్థం.. ఫిబ్రవరిలో పెళ్లి!
Hrithik Roshan: చిత్రహింసలు పడుతూ ఉండాల్సినంత అవసరం లేదు