Rishab Shetty: 'కాంతార' ప్రివ్యూస్.. పండగ ముందు ఫస్ట్ షో
ABN, Publish Date - Sep 17 , 2025 | 02:18 PM
కథ కాదు... ఈసారి ఓ ఆధ్యాత్మిక యుద్ధం చేయబోతున్నాడు కన్నడ హీరో. మల్టీ లాంగ్వేజ్, మల్టీ కల్చర్, మల్టీ బ్లాస్ట్ కు సిద్ధమయ్యాడు. పైగా హాలీడేస్ ను క్యాష్ చేసుకునేందుకు ప్రిపేర్ అవుతున్నాడు. వనంలో మొదలైన కథ ఇప్పుడు మాస్ గా మారబోతోంది. చూస్తుంటే అక్టోబర్ 2 థియేటర్లలో తాండవం జరిగేలా ఉంది.
రిషబ్ శెట్టి (Rishab Shetty) 'కాంతార' తో ఓవర్ నైట్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. హోంబలే ఫిల్మ్స్ (Hombale Films) నిర్మాణంలో చిన్న సినిమాగా వచ్చి భారీ విజయాన్ని అందుకున్న ఈ మూవీ.. అంతరించిపోతున్న భూతకళకు ప్రాణం పోసింది. దీంతో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామి సృష్టించింది. అలాంటి 'కాంతార' (Kantara) కు ప్రీక్వెల్ (Prequel) వచ్చేస్తుండటంతో అంచనాలు భారీగా నెలకొన్నాయి. మూవీ కోసం ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తున్న తరుణంలో మేకర్స్ నయా ప్లాన్ కు శ్రీకారం చుట్టడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.
అక్టోబర్ 2న బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించేందుకు రెడీ అయ్యాడు రిషబ్ శెట్టి. ఇప్పటికే బయటకు వచ్చిన ప్రమోషన్ కంటెంట్ సినిమాపై ఓ రేంజ్ లో హైప్ ను క్రియేట్ చేసింది. రీసెంట్ గా పంజాబీ సింగర్ దిల్జిత్ దోసాంజ్ (Diljit Dosanjh) ఈ సినిమాలో పవర్ ఫుల్ సాంగ్ ను పాడనున్నాడు. చూస్తుంటే 'కాంతార' తరహాలో మళ్లీ దుమ్ము రేపేందుకు సిద్ధమవుతున్నట్లు అర్థమవుతోంది. అందుకే గాంధీ జయంతితో పాటు దసరా సెలవులను క్యాష్ చేసుకునేలా ప్లాన్ చేస్తున్నారట. బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టేలా మాస్టర్ ప్లాన్ వేస్తున్నారట.
'కాంతార' ఛాప్టర్ 1 (Kantara Chapter 1) కోసం అడ్వాన్స్ షోలు ప్లాన్ చేస్తున్నారట. భారతదేశం అంతటా మల్టీ లాంగ్వేజ్‌లో విడుదల చేయాలనుకుంటున్నారట. ఇటీవలి కాలంతో ప్రీమియర్ షోస్ సైతం భారీ మొత్తాన్ని కలెక్ట్ చేస్తున్నాయి. ఉదాహరణకు 'చెన్నై ఎక్స్‌ప్రెస్' (Chennai Express) ప్రీమియర్ షోస్ ద్వారా రూ. 6.75 కోట్లు వసూలు చేయగా, ' స్త్రీ 2' (Stree 2) రూ. 9.40 కోట్లు వసూలు చేసింది. అలానే 'తల్వార్' (Talvar) మూవీస్ సైతం ఊహించని విధంగా ప్రీమియర్ షోస్ ద్వారా భారీ మొత్తాన్నే వసూలు చేసింది. దీంతో 'కాంతార ఛాప్టర్ 1' కు కూడా ప్రీమియర్ షోలు వేయాలనే ఆలోచనలో ఉన్నారట నిర్మాతలు. మౌత్ టాక్ తో సినిమాకు మంచి ఓపెనింగ్స్ వస్తాయన్నది వారి నమ్మకం. పైగా దసరా పండగ, వీకెండ్ డేస్ కూడా కలిసి వస్తాయని అనుకుంటున్నారు.
'కాంతార ఛాప్టర్ 1' తో పోటీ పడేందుకు మరో హిందీ మూవీ సిద్ధమైంది. వరుణ్ ధావన్, జాన్వీకపూర్ నటించిన 'సన్నీ సంస్కారీ కీ తులసీ కుమారి' (Sunny Sanskari Ki Tulsi Kumari,) అక్టోబర్ 2నే విడుదల అవుతోంది. ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులతో ఉన్న జాన్వీ ఈ సినిమాపై గట్టిగానే హోప్స్ పెట్టుకుంది. ఒకే రోజు రెండు సినిమాలు రావడం వల్ల థియేటర్ల వద్ద భారీ క్రౌడ్ ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే 'కాంతార 1' కి ఊహించలేని హైప్ ఉండటమే కాదు టికెట్టు దొరికితే అదృష్టం అన్నట్టుగా మారిన తరుణంలో దీనితో బాలీవుడ్ మూవీ పోటీపడటం హాట్ టాపిక్ గా మారింది. మరి రిషబ్ తో పోటీ పడుతున్న జాన్వీ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
Read Also: Modi biopic: నరేంద్ర మోదీగా ఉన్ని ముకుందన్...
Read Also: Mirai: హీరో, డైరెక్టర్ కు కార్ గిఫ్ట్...