Madhoo Bala: బలవంతంగా లిప్ కిస్ పెట్టించారు.. చివరకు
ABN , Publish Date - Jun 15 , 2025 | 06:28 PM
సీనియర్ నటి మధుబాల(Madhoo Bala) గురుంచి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రోజా(Roja)సినిమాలో ఆమె నటనకు ఫ్యాన్స్ కానీ వారుండరు.
Madhoo Bala: సీనియర్ నటి మధుబాల(Madhoo Bala) గురుంచి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రోజా(Roja)సినిమాలో ఆమె నటనకు ఫ్యాన్స్ కానీ వారుండరు. అయితే కెరీర్ లో అతి తక్కువ సినిమాలు చేసినా కూడా ఆమె కంటూ ఒక గుర్తింపును సంపాదించుకుంది మధుబాల. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే మధుబాల సినిమాలకు గుడ్ బై చెప్పింది.
ఇక ఈ మధ్యకాలంలో సీనియర్ హీరోయిన్లు రీఎంట్రీ ఇస్తున్న విషయం తెల్సిందే. ఇక మధుబాల కూడా రీఎంట్రీ ఇచ్చి మంచి మంచి సినిమాల్లో నటిస్తోంది. తెలుగులో కూడా ఆమె మంచి సినిమాల్లోనే కనిపిస్తుంది. ఇక తాజాగా మధుబాల ఒక ఇంటర్వ్యూలో తన మనోగతాన్ని బయటపెట్టింది.
ఇప్పుడంటే సోషల్ మీడియా పెరిగి.. జనరేషన్ మారడంతో లిప్ కిస్ లు, ఇంటిమేటెడ్ సీన్స్ కు హీరోయిన్లు ఓకే అనేస్తున్నారు. కానీ, అప్పట్లో స్టార్ హీరోయిన్లుగా ఉన్నా కూడా లిప్ కిస్ లకు దూరంగా ఉండేవారు. గ్లామర్ షో చేయడానికి ఇష్టపడేవారు కాదు. అలాంటి హీరోయిన్స్ లో మధుబాల కూడా ఉంది. ఆమె చేసిన ఏ సినిమాలో కూడా గ్లామర్ ఒలకబోయడం కానీ, లిప్ కిస్ పెట్టిన దాఖలాలు లేవు.
Naga Chaitanya- Samantha: మళ్లీ కలవబోతున్న చై- సామ్.. ?
అయితే సినిమాలో కనిపించలేదు కానీ, ఒక సినిమా కోసం మాత్రం లిప్ కిస్ పెట్టినట్లు మధుబాల ఈ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. " నేను సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన దగ్గరనుంచి గ్లామర్ చూపించడానికి కానీ, లిప్ కిస్ చేయడానికి కానీ ఒప్పుకోను అని కండీషన్ పెట్టుకున్నాను. కానీ, ఒక సినిమా కోసం లిప్ కిస్ పెట్టాల్సివచ్చింది. సినిమాలో ఆ కిస్ కు ప్రాధాన్యత ఎక్కువ ఉండడంతో చిత్రబృందం నన్ను బలవంత పెట్టి ఆ లిప్ కిస్ కు ఒప్పించారు.
నాకు ఇష్టం లేకపోయినా కథ డిమాండ్ చేసింది కదా అని చాలా ఇబ్బంది పడుతూనే లిప్ లాక్ సీన్ చేశాను. ఆ తరువాత ఆ కిస్ సీన్ ను ఎడిటింగ్ లో తీసేసారు. అంత ఇబ్బందిపడి ఆ సీన్ చేస్తే చివరకు ఎడిటింగ్ లో కట్ చేశారు. ముద్దు సీన్ చేయమని అడిగినప్పుడు నేనేమి వారిమీద గొడవకు దిగలేదు. సినిమా కోసం ఎలాంటి పాత్రల్లోనైనా నటించాల్సి వస్తుంది. ఇది నేను చాలా సీనియర్ హీరోయిన్స్ దగ్గర నేర్చుకున్నాను" అని చెప్పుకొచ్చింది. అయితే ఆ సినిమా ఏంటి.. ? టాలీవుడ్ నా.. ? బాలీవుడ్ నా.. ? అనేది మాత్రం చెప్పలేదు. ప్రస్తుతం మధుబాల కన్నప్ప సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది. జూన్ 27 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో మధుబాలకు మంచి పేరు వస్తుందేమో చూడాలి.