Naga Chaitanya- Samantha: మళ్లీ కలవబోతున్న చై- సామ్.. ?
ABN , Publish Date - Jun 15 , 2025 | 05:11 PM
ఎవ్వరికి ఎవ్వరినీ జంటగా అనుకుంటాడో.. ఆఖరికి వాళ్లనే ఓ చోట కలిపేస్తాడు అంటూ ఏ మాయ చేసావే(Ye Maaya Chesave) సినిమాతో అక్కినేని నాగచైతన్య(Akkineni Naga Chaitanya- సమంత(Samantha) పాడుకున్నట్లే.. దేవుడు ఈ జంటను కూడా పెళ్లి పేరుతో ఒకటి చేశాడు.
Naga Chaitanya- Samantha: ఎవ్వరికి ఎవ్వరినీ జంటగా అనుకుంటాడో.. ఆఖరికి వాళ్లనే ఓ చోట కలిపేస్తాడు అంటూ ఏ మాయ చేసావే(Ye Maaya Chesave) సినిమాతో అక్కినేని నాగచైతన్య(Akkineni Naga Chaitanya- సమంత(Samantha) పాడుకున్నట్లే.. దేవుడు ఈ జంటను కూడా పెళ్లి పేరుతో ఒకటి చేశాడు. జోష్ సినిమా తరువాత చై.. ఒక మంచి లవ్ స్టోరీ చేయడానికి సిద్దమయిన సమయంలో గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఏ మాయ చేసావే స్క్రిప్ట్ వినిపించాడు. అప్పటికే ఆ సినిమాను పలువురు హీరోలు రిజెక్ట్ చేయగా .. లవ్ స్టోరీలు అక్కినేని ఫ్యామిలీకి బాగా కలిసి వస్తాయని నాగ్, చై కలిసి ఈ సినిమాను ఓకే చేశారు. ఇక అప్పటికే యాడ్స్ లో నటిస్తున్న సమంతను హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అలా చై - సామ్ జంటగా ఏ మాయ చేసావే సినిమా తెరకెక్కి 2010 ఫిబ్రవరి 26న విడుదలైన సంచలన విజయం సాధించింది.
సమంత ఎన్ని మంచి సినిమాలు తీసినా.. ఎన్ని అవార్డులు వచ్చినా తెలుగువారికి ఆమెప్పుడు జెస్సీ గానే గుర్తుంటుంది. ఈ సినిమా సమయంలో చై - సామ్ మధ్య ఏర్పడిన పరిచయం .. ప్రణయంగా మారి.. పరిణయానికి దారితీసింది. ఈ జంటను చూసి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. కలకాలం కలిసి ఉండాలని కోరుకున్నారు. కానీ, మనుషులు ఒకటి తలిస్తే.. దైవం ఇంకొకటి తలిచినట్లు.. నాలుగేళ్లు కూడా కలిసి ఉండలేక చై - సామ్ విడాకులు తీసుకొని విడిపోయారు. అయితే వీరిద్దరి మధ్య విడాకులకు కారణం ఏంటి అనేది ఇప్పటివరకు తెలియలేదు.
ఇక సోషల్ మీడియాలో మాత్రం చై ది తప్పని సామ్ అభిమానులు.. కాదు సామ్ దే తప్పు అని అక్కినేని అభిమానులు చెప్పుకొస్తూనే ఉన్నారు. ఇక సామ్ ను మర్చిపోయిన చై .. శోభితాను వివాహం చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. ఇంకోపక్క సామ్ సైతం మయోసైటిస్ వ్యాధి నుంచి కొద్దికొద్దిగా కోలుకుంటూ కెరీర్ ను బిల్డ్ చేసుకుంటుంది. అంతేకాకుండా రాజ్ నిడిమోరు తో ఆమె రిలేషన్ లో ఉందని కుడి వార్తలు వినిపిస్తున్నాయి.
Abishan Jeevinth: రజినీకాంత్ ను కలిసిన టూరిస్ట్ ఫ్యామిలీ డైరెక్టర్..
చై - సామ్ విడిపోయి దాదాపు నాలుగేళ్లు అవుతున్నా వారి గురించి వచ్చే ఏ వార్త అయినా సోషల్ మీడియాను షేక్ చేస్తూనే ఉంటుంది. తాజాగా సామ్ - చై మళ్లీ కలవబోతున్నారు. ఏంటి నిజమా.. ? అని ఆశ్చర్యపోకండి. ఈమధ్యకాలంలో రీరిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెల్సిందే. తాజాగా ఈ జంట కలిసి నటించిన మొదటి సినిమా ఏ మాయ చేసావే రీరిలీజ్ కానుంది. జూలై 18 న ఈ సినిమా రీరిలీజ్ కానుంది. ఈ జంటకు తమ మొదటి సినిమా ఎంత ప్రత్యేకమో అందరికీ తెల్సిన విషయమే.
ముఖ్యంగా సమంతకు తన మొదటి సినిమా చాలా స్పెషల్. ఈ విషయం ఆమె ఎన్నో సార్లు చెప్పుకొచ్చింది. అంతెందుకు తన పెళ్లి చీరలో కూడా ఈ సినిమాకు సంబంధించిన ఫోటోలను కూడా డిజైన్ చేయించుకుంది. ఇప్పుడు వారు విడిపోయినా కూడా ఆ జ్ఞాపకాలను మర్చిపోవడం చాలా కష్టమైన పనినే అని చెప్పాలి. ఇక ఇప్పుడు అందరి మదిలో ఉన్న ఒకే ఒక్క ప్రశ్న. రీ రిలీజ్ ప్రమోషన్స్ కనుక ఉంటే ఈ జంట మళ్లీ కలవబోతుందా.. ? అని. దీనికి మాత్రం ఎవరి దగ్గర సమాధానం లేదు. విడాకుల అయినా దగ్గరనుంచి ఇప్పటివరకు చై - సామ్ ఒక్కసారి కూడా ఎదురుపడింది లేదు. చాలా ఇంటర్వూస్ లలో సామ్.. చై ను తిట్టిపోసింది. చై మాత్రం సామ్ తన మంచి కోస్టార్ అని చెప్పుకొచ్చాడు. మరి ఇప్పుడు ఈ ప్రమోషన్స్ లో ఈ ఇద్దరు కలుస్తారా.. ? లేదా.. ? అనేది చూడాలి.