Raviteja 76: టైటిల్ లీక్ ఇచ్చేశారుగా.

ABN , Publish Date - Nov 10 , 2025 | 03:24 PM

మాస్ మహారాజా రవితేజ, కిషోర్ తిరుమల దర్శకత్వంలో #RT76 తెరకెక్కుతున్నసంగతి తెలిసిందే. SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీగా ఈ సినిమాను ప్లాన్ చేసారు.

మాస్ మహారాజా రవితేజ(Ravi Teja), కిషోర్ తిరుమల (kishore Tirumala) దర్శకత్వంలో #RT76 తెరకెక్కుతున్నసంగతి తెలిసిందే. SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీగా ఈ సినిమాను ప్లాన్ చేసారు. ఇందులో రవితేజ సరసన ఆషికా రంగనాథ్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాకి 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'  టైటిల్ అనుకుంటున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే సోమవారం ఈ సినిమా టైటిల్ విడుదల చేయడానికి టైం ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ లోపే టైటిల్ సగం చెప్పి చెప్పకుండా పోస్టర్స్ లీక్ చేసారు. టైటిల్ చూస్తే..  మొత్తానికి  'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టైటిల్నే ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.  (Bhartha Mahashayulaku Vignapthi)

Ravi-76.jpg

తాజాగా ఓ పాత కోసం ప్రత్యేకమైన సెట్‌ వేశారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో రూపొందుతున్న  అదిరిపోయే డ్యాన్స్ నంబర్‌  చిత్రీకరిస్తున్నారు. ఎమోషనల్ కథలతో అలరించే దర్శకుడు కిశోర్ తిరుమల ఈ చిత్రాన్ని అన్ని వర్గాల ప్రేక్షకుల ఆకట్టుకునేలా రూపొందిస్తున్నారు. ఈ సినిమాకి సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ  ప్రసాద్ మూరెళ్ళ. నేషనల్ అవార్డు గ్రహీత శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్.

Updated Date - Nov 10 , 2025 | 03:32 PM