Mirai: ఇక ఆట మొద‌లు.. మిరాయ్ క్రేజీ అప్డేట్స్‌ వ‌చ్చేశాయ్‌

ABN , Publish Date - Aug 26 , 2025 | 12:37 PM

తేజ సజ్జా సూపర్‌ యోధగా న‌టించిన‌ ‘మిరాయ్‌’ సినిమా రిలీజ్ ట్రైల‌ర్ అప్డేట్స్ మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

mirai

‘హను-మాన్‌’ చిత్రంతో దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించిన యువ కథానాయకుడు తేజ సజ్జా (Teja Sajja) త్వ‌ర‌లో ‘మిరాయ్‌’ (Mirai ) సినిమాతో సూపర్‌ యోధగా అలరించనున్న విష‌యం తెలిసిందే. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ ( People Media Factory) సార‌థ్యంలో విశ్వప్రసాద్‌, కృతిప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఈగ‌ల్ ఫేమ్‌ కార్తీక్‌ ఘట్టమనేని (Karthik Ghattamaneni) దర్శకుడు. రితికా నాయ‌క్ (Ritika Nayak) క‌థానాయిక కాగా మంచు మ‌నోజ్ (Manchu Manoj) ప్ర‌తి నాయ‌కుడిగా జ‌గ‌ప‌తి బాబు (Jagapathi Babu), శ్రేయ (Shriya Saran) కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

mirai

అయితే సెప్టెంబ‌ర్ 5న విడుద‌ల కావాల్సిన ఈ చిత్రం ఇటీవ‌ల టాలీవుడ్‌లో బంద్ త‌దిత‌ర ప‌రిణామాల వ‌ల‌న‌ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు ఆల‌స్యం కావ‌డంతో వాయిదా ప‌డింది. ఈ నేప‌థ్యంలో మక‌ర్స్ తాజాగా మంగ‌ళ‌వారం ఈ చిత్రానికి సంబంధించి కీల‌క అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాను 2డి, 3 డి ఫార్మెట్స్‌లో ఎనిమిది భాషల్లో సెప్టెంబ‌ర్‌12న ప్ర‌పంచ వ్యాప్తంగా పాన్ ఇండియాగా రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అంతేగాక ఈ నెల 28న ట్రైల‌ర్ రిలీజ్ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టిస్తూ ఓ పోస్ట‌ర్ రిలీజ్ చేశారు. కాగా బాలీవుడ్‌ టాప్‌ ఫిల్మ్‌ మేకర్‌ కరణ్‌ జోహార్‌ ఉత్తరాదిలో ఈ సినిమాను విడుదల చేయనుండ‌డం విశేషం.

Updated Date - Aug 26 , 2025 | 01:49 PM