Ayyana Mane: తెలుగులోనూ వస్తున్న కన్నడ వెబ్ సీరిస్...
ABN , Publish Date - May 14 , 2025 | 02:37 PM
కన్నడ వెబ్ సీరిస్ 'అయ్యనా మానే' ఇప్పుడు తెలుగులోనూ రాబోతోంది. ముగ్గురు కోడళ్ళ రహస్య మరణాల మిస్టరీ ఛేదనగా ఈ వెబ్ సీరిస్ సాగడం విశేషం.
జీ 5 (ZEE 5) లో కన్నడ ఒరిజినల్ వెబ్ సిరీస్ ‘అయ్యనా మానే’ (Ayyana Mane) రికార్డుల్ని క్రియేట్ చేసింది. ఐఎండీబీలో 8.6 రేటింగ్‌తో ఈ వెబ్ సిరీస్ దూసుకుపోతోంది. ఖుషీ రవి (Khushi Ravi), అక్షయ నాయక్ (Akshaya Nayak), మానసి సుధీర్ (Manasi Sudheer) ప్రధాన పాత్రధారులుగా రమేష్ ఇందిర (Ramesh Indira) దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ రూపొందింది. కన్నడ, హిందీ, తమిళ భాషలలో ఇది ఇప్పటికే వీక్షకుల నుండి విశేష ఆదరణ చూరగొంది. ఈ గ్రిప్పింగ్ ఫ్యామిలీ థ్రిల్లర్ ఇప్పుడు మే 16 నుండి తెలుగులో స్ట్రీమింగ్ కానుంది.
చిక్ మంగళూర్ నేపథ్యంలో 'అయ్యనా మానే' కథ సాగుతుంది. ముగ్గురు కోడళ్ల రహస్య మరణాల చుట్టూ సాగే సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. ప్రతి మరణం కుల దేవత కొండయ్యకు సంబంధించిన శాపం వల్లే జరుగుతుందని అందరూ నమ్ముతుంటారు. జాజీ (ఖుషీ రవి) ఆ కుటుంబంలోకి ప్రవేశించినప్పుడు తన ప్రాణాలను పోతాయని ఆమె గ్రహిస్తుంది. అయితే నమ్మకమైన పనిమనిషి తాయవ్వ, సిన్సియర్ ఆఫీసర్ మహానేష్ మద్దతుతో ఆ ఇంటి రహస్యాలను బయటకు తీసుకు వస్తూ ఉంటుంది. సస్పెన్స్, థ్రిల్లర్, ఫ్యామిలీ అంశాలతో తెరకెక్కించిన ఈ వెబ్ సీరిస్ ఓటీటీలో అందరినీ ఆకట్టుకుంది. తెలుగులో స్ట్రీమింగ్ కాబోతున్న సందర్భంగా నటి ఖుషీ రవి మాట్లాడుతూ, ''ఈ వెబ్ సీరిస్ లో భాగం కావడం ఆనందంగా ఉంది. నా పాత్ర సవాలుతో కూడుకుని ఉంటుంది. ఇలాంటి కన్నడ కథలను ప్రాముఖ్యతను కల్పించిన జీ 5, శ్రుతి నాయుడు ప్రొడక్షన్స్‌కి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఆడియెన్స్ మా వెబ్ సిరీస్ మీద, నా పాత్ర మీద కురిపిస్తున్న ప్రేమను చూస్తే ఎంతో సంతోషంగా ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు తెలుగులోకి రాబోతోంది. ఇది నాకు ఎంతో ఆనందం కలిగించే విషయం. ఇప్పుడు సౌత్ అంతటా కూడా మా సిరీస్ సత్తాను చాటుకుంటుంది'' అని అన్నారు.
Also Read: Vijay Devarakonda Vs Rajashekhar: రౌడీ జనార్దన్ తో.. రాజశేఖర్ ఢీ! కాంబినేషన్ అదిరింది?
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి