Sir Madam OTT: సర్ మేడమ్.. ఓటీటీకి వచ్చేశారు
ABN, Publish Date - Aug 22 , 2025 | 07:05 AM
ఇటీవల తెలుగులో విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకున్న అనువాద చిత్రం సర్ మేడమ్ డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.
ఆగస్టు మొదటి వారంలో తెలుగులో విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకున్న అనువాద చిత్రం సర్ మేడమ్ (Sir Madam) డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. తమిళంలో తలైవన్ తలైవి (Thalaivan Thalaivii) పేరుతో రూపొందిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి (Vijay Sethupathi), నిత్యా మీనన్ (Nithya Menen) జంటగా నటించగా గతంలో మారన్, వీరన్, కెప్టెన్ మిల్లర్ వంటి సినిమాలను నిర్మించిన సత్యజ్యోతి ఫిలింస్ ఈ సినిమాను నిర్మించింది. సూర్య, కార్తి, శివకార్తికేయన్ వంటి స్టార్ హీరో సినిమాలకు దర్శకత్వం వహించిన పాండిరాజ్ (Pandiraaj) డైరెక్ట్ చేయడం విశేషం. యోగిబాబు (Yogi Babu) సైతం ఓ కీలక పాత్రలో నటించగా సంతోష్ నారాయణన్ (Santhosh Narayanan) సంగీతం అందించాడు. జూలై25న తమిళనాట ఈ చిత్రం థియేటర్లలోకి రాగా రెండు వారాల తర్వాత తెలుగులో విడుదలైంది. కాగా ఈ చిత్రం రూ. 100కోట్లకు పైగా వసూళ్లు సాధించి హిట్‌గా నలిచింది.
కథ విషయానికి వస్తే.. ఓ ఊర్లో హోటల్ నడుపుకునే ఆకాశ వీరయ్య పరాట చేయడంలో ఎక్స్‌ఫర్ట్. ఓ పెళ్లి వేడుకలో రాణిని చూసి ప్రేమలో పడిపోతాడు. మొదట్టో వారి పెళ్లికి ఇరు కుటంబాలు ఒప్పుకున్నప్పటికీ ఆ తర్వాత వారి నేపథ్యాలు తెలిసి పెళ్లికి అంగీకరించారు. దాంతో వీరయ్య, రాణి ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకుని కాపురం పెట్టేస్తారు. ఈక్రమంలో నెమ్మదిగా వారింట్లో ఉండే ఆడ వాళ్ల మధ్య గోడవలు ప్రారంభమై అవి పెద్దవి అవుతాయి. చివరకు వీరయ్య రాణి విడాకులు తీసుకునే వరకు వస్తారు. ఈ నేపథ్యంలో అసలు వాళ్ల మధ్య గొడవలకు కారణమేంటి, మరి చివరకు కలిశారా, వేరు పడ్డారా అనే పాయింట్‌తో సినిమా సాగుతుంది.
ప్రతి ఇంట్లోనూ కనిపించే కథే ఇది. సామాన్య కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే ఈ కథను దర్శకుడు పాండిరాజ్ చాలా సహజంగా తెరకెక్కించాడు. ఇష్టపడి పెళ్లి చేసుకున్న జంటకు జీవితంలో ఎదురైన సమస్యలు, వాటికి పరిష్కారాలు, ఇద్దరి మధ్య అల్లరి ఆటలు నవ్విస్తాయి. వీరయ్య, మహారాణి పాత్రలు, ఇతర కుటుంబ సభ్యుల పాత్రలు చక్కని వినోదాన్ని పంచుతాయి. హీరోహీరోయిన్ల మధ్య విడాకులకు సంబంధించిన సీన్స్ అలరిస్తాయి. వైవాహిక బంధాన్ని నిలబెట్టుకోవడానికి వీరయ్య చేసే ప్రయత్నాలు, వైవాహిక బంధంపై నేపథ్యంలో క్లైమాక్స్‌లో సాగే సన్నివేశాలు మనసుకు హత్తుకుంటాయి, ఇప్పుడీ సర్ మేడమ్ (Sir Madam) సినిమా ఈ రోజు (ఆగస్టు 22) శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) ఓటీటీలో తమిళంతో పాటు తెలుగు ఇతర భాషల్లోనూ అందుబాటులోకి వచ్చింది. మంచి ఫ్యామిలీ డ్రామా చూడాలనుకునే వారికి ఈ చిత్రం మంచి ఛాయిస్. అయితే కాస్త అరవ యాస, సంస్కృతులను అర్ధం చేసుకోవాల్సి ఉంటుంది.