Geetha bhagat: ట్రెండింగ్‌లో ఆర్.పి.పట్నాయక్ ‘తను రాధా.. నేను మధు’..
ABN, Publish Date - Sep 20 , 2025 | 03:49 PM
‘కథా సుధ’ పేరుతో వారానికో షార్ట్ మూవీని విడుదల చేస్తూ ఆడియన్స్‌ని అలరిస్తుంది ఈటీవీ విన్ ఓటీటీ. తాజాగా ‘తను రాధా.. నేను మధు’ అనే కొత్త ఎపిసోడ్‌ను విడుదల చేసింది.
‘కథా సుధ’ పేరుతో వారానికో షార్ట్ మూవీని విడుదల చేస్తూ ఆడియన్స్‌ని అలరిస్తుంది ఈటీవీ విన్ ఓటీటీ(ETv win). తాజాగా ‘తను రాధా.. నేను మధు’ (Tanu Radha Nenu madhu)అనే కొత్త ఎపిసోడ్‌ను విడుదల చేసింది. 33 నిమిషాల నిడివి గల ఈ షార్ట్ ఫిల్మ్ ఈ నెల 14 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. మ్యూజిక్ డైరెక్టర్ ఆర్.పి.పట్నాయక్ (RP Patnaik) దీనికి దర్శకత్వం వహించారు. లక్ష్మీ దుర్గ కత్తి, జయవంత్ పసుపులేటి ప్రధాన పాత్రల్లో నటించారు. బునిషి కిరణ్, శ్రీధర్ రామిరుడ్డి కీలక పాత్రధారులు. విదేశాల్లో జరిగిన ఓ యదార్థ సంఘటనను ఆధారంగా ఈ షార్ట్ మూవీని తెరకెక్కించారు ఆర్.పి.పట్నాయక్. స్వచ్ఛమైన ప్రేమలో నమ్మకం, సహనం, భావోద్వేగం వంటివి ఉంటాయని, వాటి లోతుని 33 నిమిషాల్లో తెలియజేస్తూ తెరకెక్కించారని, క్రైమాక్స్‌కు అందరినీ భావోద్వేగానికి గురి చేసిందని మేకర్స్ చెబుతున్నారు. కొన్ని వందల సినిమా ఈవెంట్లను, సెలబ్రిటీ ఇంటర్వ్యూలను హోస్ట్ చేసి గుర్తింపు పొందిన యాంకర్ గీతా భగత్ ‘తను రాధ.. నేను మధు’తో నిర్మాతగా మారారు. రఘురాం బొలిశెట్టితో కలిసి ఈ సినిమా తీశారు. చిత్రీకరణ మొత్తం అమెరికాలోనే జరిగింది. డిజిటల్ రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే అద్భుతమైన వ్యూయర్ షిప్‌ను దక్కించుకుని ట్రెండింగ్‌లో ఉందని గీతా భగత్ చెప్పారు.