OTT Movie: ముత్తయ్య వెనుకే... సుమంత్ అనగనగా...

ABN , Publish Date - May 05 , 2025 | 07:25 PM

సుమంత్ నటించిన 'అనగనగా' చిత్రం ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. అయితే ఇదే సమయంలో సుమంత్, మృణాళ్ ఠాగూర్ మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ అంటూ పుకార్లు వస్తున్నాయి.

సుమంత్‌ కుమార్ (Sumanth Kumar) లీడ్ రోల్ లో సన్నీ సంజయ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం ‘అనగనగా’ (Anaganaga). కాజల్‌ చౌదరి (Kajal Chowdary) కథానాయిక. రాకేశ్ రెడ్డి గడ్డం, రుద్రా మదిరెడ్డి దీనిని నిర్మించారు. ఈ సినిమా ఈటీవీ విన్ (Etv Win) లో ఉగాదికి స్ట్రీమింగ్ కావల్సింది. కానీ కాలేదు. అయితే అతి ఈ నెల 15 నుండి స్ట్రీమింగ్ కానుందని మేకర్స్ తెలిపారు. ఈ మధ్య కాలంలో ఈటీవీ విన్ ఒరిజినల్స్ మీద ఫోకస్ పెట్టింది. అలానే థియేటర్లలో తమ చిత్రాలను రిలీజ్ చేసుకోలేని నిర్మాతల సినిమాలను తన ఓటీటీ ద్వారా వీక్షకుల ముందుకు తీసుకొస్తోంది. అలా మే 1న 'బలగం' సుధాకర్ రెడ్డి టైటిల్ రోల్ ప్లే చేసిన 'ముత్తయ్య' సినిమాను ఈటీవీ స్ట్రీమింగ్ చేసింది. గతంలోనూ సుమంత్ నటించిన కొన్ని సినిమాలు కూడా ఓటీటీలోనే స్ట్రీమింగ్ అయ్యాయి. ఇప్పుడు 'అనగనగా' కూడా అదే బాట పట్టింది. 'అనగనగా' అందరికీ కనెక్ట్ అయ్యే కథని, హార్ట్ టచ్చింగ్ గా ప్రజెంట్ చేయడం జరిగిందని మేకర్స్ చెబుతున్నారు. ఇందులో కాజల్ చౌదరి హీరోయిన్ గా నటించగా మాస్టర్ విహార్ష్ కీలక పాత్ర పోషించాడు. అవసరాల శ్రీనివాస్, అను హాసన్, రాకేశ్‌ రాచకొండ, బీవీఎస్ రవి, కౌముది నేమని ప్రధాన పాత్రలలో కనిపించ బోతున్నారు. ఈ చిత్రానికి చందు రవి సంగీతం అందించాడు.


అవన్నీ పుకార్లేనా!

సుమంత్ ఫిల్మ్ కెరీర్ ఇలా ఉంటే... అతను 'అనగనగా' అంటూ తన ప్రేమకథ ఏమైనా చెబుతాడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే నటి కీర్తిరెడ్డికి విడాకులు ఇచ్చిన తర్వాత సింగిల్ గా ఉన్న సుమంత్ 'వాళ్ళతో మింగిల్ అవుతున్నాడు... వీళ్ళతో మింగిల్ అవుతున్నాడు'... అంటూ చాలా కథలు వచ్చాయి. కొందరైతే సుమంత్ రెండో పెళ్ళి చేసుకున్నాడని కూడా చెప్పుకుంటూ ఉంటారు. కానీ అతని వైపు నుండి సెకండ్ మ్యారేజ్ విషయమై ఎలాంటి క్లారిటీ లేదు. ఇదిలా ఉంటే... సుమంత్ ప్రస్తుతం మృణాళ్ ఠాకూర్ తో లవ్ లో ఉన్నాడనే వార్త ఒకటి విపరీతంగా ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ 'సీతారామం' మూవీలో నటించింది. అందులో సుమంత్ సైతం కీలక పాత్ర పోషించాడు. అప్పుడే వారి మధ్య అనుబంధం ఏర్పడిందని అంటున్నారు. ఆ తర్వాత మృణాళ్ ఠాకూర్ నాని 'హాయ్ నాన్న', విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీస్టార్' మూవీస్ లో నటించింది. అయితే ఈ రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయినా కూడా మృణాల్ ఠాకూర్ కు తెలుగులో మరో ఛాన్స్ దక్కింది. అందుకే సుమంత్, మృణాళ్ ఠాకూర్ మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ అనే వార్తలు వస్తున్నట్టు తెలుస్తోంది.

sm.jpg


అడివి శేష్ హీరోగా సుమంత్ సోదరి సుప్రియ 'డెకాయిట్' అనే సినిమాను ప్రొడ్యూస్ చేస్తోంది. ఈ సినిమాలో మొదట శ్రుతిహాసన్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. కొన్ని రోజుల షూటింగ్ కూడా జరిగింది. కానీ ఆ తర్వాత శ్రుతిని తప్పించడమో, ఆమే ఈ ప్రాజెక్ట్ నుండి వెళ్ళిపోవడమో జరిగింది. దాంతో ఆమె స్థానంలోకి మృణాల్ ఠాకూర్ వచ్చి చేరింది. సుమంత్ తో ఉన్న అనుబంధం కారణంగానే మృణాల్ ను ఈ సినిమాకు తీసుకున్నారని కొందరు గుసగుసలాడుతున్నారు. అయితే... సినిమా రంగంలో ఇలాంటి పుకార్లు చాలా కామన్ అని, ఇటు సుమంత్ లేదా అటు మృణాల్ ఈ విషయంపై పెదవి విప్పేవరకూ ఎలాంటి నిర్థారణకు రానవసరం లేదని మరికొందరు చెబుతున్నారు.

Also Read: Mohanlal Birthday Special: మరోసారి జనం ముందుకు 'చోటా ముంబై'

Also Read: CPI Narayana: బిగ్‌బాస్ షో.. ఓ ఖ‌రీదైన‌ వ్యభిచారం! బ్యాన్ చేయాల్సిందే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - May 05 , 2025 | 07:31 PM