Oh Bhama Ayyo Rama OTT: సడన్‌గా.. ఓటీటీకి సుహాస్ లేటెస్ట్ మదర్ సెంటిమెంట్ మూవీ
ABN, Publish Date - Jul 31 , 2025 | 04:08 PM
సుహాస్ హీరోగా ఇటీవలే థియేటర్లలోకి వచ్చిన చిత్రం ‘ఓ భామ అయ్యో రామ’ సడన్‌గా డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది.
సుహాస్ (Suhas) హీరోగా ఇటీవలే థియేటర్లలోకి వచ్చిన చిత్రం ‘ఓ భామ అయ్యో రామ’ (O Bhama Ayyo Rama). ఈ చిత్రంతో మలయాళ బ్యూటీ మాళవిక మనోజ్(జో ఫేమ్) (Malavika Manoj) టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా కెరీర్, మదర్ సెంటిమెంట్‌తో కూడిన లవ్‌స్టోరీగా రూపొందిన ఈ సినిమాకు రామ్ గోధల (Ram Godhala) దర్శకత్వం వహించగా హరీష్ నల్ల నిర్మించారు. జూలై 11న ప్రేక్షకుల ఎదుటకు వచ్చిన ఈ చిత్రం మిశ్రమ స్పందనను దక్కించుకుంది. ఇప్పుడీ సినిమా 20 రోజుల్లోనే డిజిటల్ స్ట్రీమింగ్ బాట పట్టింది.
రామ్ (సుహాస్) చిన్నతనంలోనే తల్లి (అనిత)ను కోల్పోతాడు. తండ్రి (రవీంద్ర విజయ్) దగ్గరకు తీయక పోవడంతో మేనమామ (అలీ) రామ్ బాధ్యత తీసుకుంటాడు, ఏ లోటు లేకుండా చూసుకుంటాడు. అయితే రామ్ ఎప్పటికైనా సినిమా దర్శకుడు కావాలనేది అతని తల్లి కల. కానీ రామ్ సినిమాలకు దూరంగా చదువుల కోసం ఫారెన్ వెళ్ళాలనుకుంటాడు. సత్యభామ (మాళవిక మనోజ్) రాకతో రామ్ జీవితం మారుతుంది. అమ్మ లేని లోటును తీరుస్తుంది. ఆమె రాక అతనిలో ఎలాంటి మార్పు తెచ్చింది. సినిమాలకు దూరంగా ఉండే రామ్ డైరెక్షన్ వైపు ఎందుకు అడుగులు వేశాడు? రామ్, సత్యభామల ప్రేమ కథ కంచికి చేరిందా లేదా? అన్నది కథ.
సింపుల్ కాలేజీ కుర్రాడి కథగా మొదలై ప్రేమ, భావోద్వేగాల వైపు నడుస్తుంది. ఫస్టాప్ అంతా రోటీన్ కథగా సాగుతుంది. సెకండాఫ్ నుంచి కథ సీరియస్ ట్రాక్‌లోకి వెళ్తుంది. మేనల్లుడి మీద బాధ్యతగా వ్యవహరించే అలీ పాత్ర ఎమోషన్‌గా సాగడం, సెంటిమెంట్ బాగా వర్కవుట్ అయింది. మదర్ సెంటిమెంట్ టచ్, కొన్ని చోట్ల ఫన్, ఎమోషన్ సీన్లు బాగా వర్కవుట్ అయ్యాయి. రొటీన్‌గా కాకుండా ట్విస్ట్‌తో కథను ముగించిన విధానం ఆకట్టుకుంటుంది.. ఇప్పుడీ సినిమా సడన్‌గా ఈ టీవీ విన్ (ETV Win) ఓటీటీలో స్ట్రీమింగ్కు వస్తు్ననట్లు మేకర్స్ ప్రకటించి షాక్ ఇచ్చారు. మూవీలో ఎక్కగా అసభ్యకర సన్నివేశాలు లేవు. ఫ్యామిలీ, సెంటిమెంట్ సినిమా చూడాలనుకునే వారు ఈ చిత్రాన్ని తప్పక ప్రయత్నం చేయవచ్చు.