Soothravakyam OTT: ఆ ఓటీటీల్లోకి.. అదిరిపోయే థ్రిల్లర్! అబ్బాయి మిస్సింగ్ కేసుకు వెళితే.. బయటపడ్డ అమ్మాయి మర్డర్
ABN, Publish Date - Aug 18 , 2025 | 04:56 PM
విలక్షణ నటుడు షైన్ టామ్ చాకో హీరోగా నటించిన రీసెంట్ మలయాళ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది.
గత నెల జూలైలో కేరళలో థియేటర్లకు వచ్చి అంతగా జనాధరణకు నోచుకోలేక పోయిన మలయాళ చిత్రం సూత్రవాక్యం (Soothravakyam). విలక్షణ నటుడు షైన్ టామ్ చాకో (Shine Tom Chacko) హీరోగా నటించగా విన్సీ ఆలోషియస్ (Vinci Aloysius), దీపక్ పరంబోర్ (Deepak Parambol), మీనాక్షి మాధవి, దివ్య ఎం. నాయర్ ప్రధాన పాత్రలు పోషించారు. . సినిమా బండి ప్రొడక్షన్స్ (Cinema Bandi Productions) పతాకంపై కాండ్రేగుల లావణ్యాదేవి సమర్పణలో కాండ్రేగుల శ్రీకాంత్ ఈ సినిమాను మలయాళంలో నిర్మించడం విశేషం. యూజియాన్ జాస్ చిరమ్మల్ ను దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత జూలై 25న తెలుగులోనూ విడుదల చేసినప్పటికీ ప్రచారం లేక జనాలకు చేరలేక పోయింది. ఇప్పుడీ సినిమా ఓటీటీలో అదృష్టం పరిక్షించుకునేందుకు రెడీ అయింది
కథ విషయానికి వస్తే.. కేరళలోని ఒక పోలీస్ స్టేషన్‌లో క్రిస్టో జేవియర్ (షైన్ టామ్ చాకో) సీఐగా విధులు నిర్వర్తిస్తూ ఉంటాడు. అయితే కరోనా సమయం కావడంతో యువత చెడు మార్గాలు పట్టకూడదని తనే తన స్టేషన్‌లో వారికి పాఠాలు చెప్పడం ప్రారంభిస్తాడు. ఈక్రమంలో తన టీచింగ్‌కు ఆకర్షితులై చాలామంది ఆ క్లాసులకు వస్తుంటారు. అయితే ఆ క్లాసులకు వచ్చే ఆర్య అనే అమ్మాయిపై తన అన్న వివేక్ పలుమార్లు చేయి చేసుకున్నాడనే విషయం తెలుసుకున్న సీఐ ఆ వివేక్‌ను రెండు సార్లు కొట్టి గట్టి వార్నింగ్ ఇస్తాడు. మరలా రెండు రోజుల తర్వాత చెల్లి క్లాసులో ఓ అబ్బాయితో చనువుగా ఉంటుందని వివేక్ వారిద్దరిని చితకబాదుతాడు. కాగా అ మరుసటి రోజు నుంచి వివేక్ ఆ ఏరియాలో కనబడడం మానేస్తాడు. వారి ఇంట్లో అడిగితే ఏదో జాబ్ ఇంటర్వ్యూ కోసం సిటీకి వెళ్లాడని చెబుతారు. కానీ అనుమానం వచ్చిన సీఐ కనిపించకుండా పోయిన వివేక్ అచూకీ కోసం ఎంక్వైరీ స్టార్ట్ చేస్తాడు.
ఈక్రమంలో అనూహ్యంగా ఓ అమ్మాయి మర్డర్ కేసు బయట పడుతుంది. ఇంతకు హత్యకు గురైన అమ్మాయి ఎవరు, వివేక్ ఎలా అదృశ్యం అయ్యాడు. వివేక్ కేసుకు ఈ మర్డర్ కేసుకు ఏమైనా సంబంధం ఉందా, మిస్సింగ్, మర్డర్ కేసుల్లో దోషులను పట్టుకోగలిగాడా లేదా అనే ఆసక్తికరమైన కథకథనాలతో సినిమా సాగుతుంది. సినిమా సాదాసీదాగా ప్రారంభమైన ఇంటర్వెల్ బ్యాంగ్‌నుంచి కొత్త టర్న్ తీసుకుని సినిమా చూసే వారికి హై థ్రిల్ ఇచ్చేలా సాగుతుంది.
ఎక్కడా హీరోయుక్ ఎలివేషన్స్, మాస్ సీన్లు అనేవి లేకుండా చాలా రియలిస్టిక్‌గా సినిమాను తెరకెక్కించారు. ఫస్టాప్ సోసోగా ఉన్న ఆ తర్వాతే అసలు సినిమా మొదలువుతుంది. ఇప్పుడీ సినిమమా లయన్స్ గేట్ ప్లే (Lions Gate Play), ఈటీవీ విన్ (ETV Win) ఓటీటీలో ఆగస్టు 21 నుంచి మలయాళంతో పాటు తెలుగు ఇతర భాషల్లోనూ స్ట్రీమింగ్ అవనుంది. మంచి ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ చూడాలనుకునే వారికి ఈ చిత్రం బెస్ట్ ఎక్సపీరియన్స్ ఇస్తుంది.