3Roses: బెట్టింగ్ భోగి.. సత్య అదరగొట్టాడు
ABN, Publish Date - May 27 , 2025 | 05:41 PM
నాలుగేండ్ల క్రితం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయి మంచి ఆదరణ దక్కించుకున్న వెబ్ సిరీస్ 3 రోజెస్
నాలుగేండ్ల క్రితం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయి మంచి ఆదరణ దక్కించుకున్న వెబ్ సిరీస్ 3 రోజెస్ (3Roses). ఈ సిరీస్ మొదటి సీజన్‌లో ఈషారెబ్బా (Eesha Rebba), పాయల్ రాజ్‌పుత్ (PayalRajput), పూర్ణ (Poorna ) ప్రధాన పాత్రలు పోషించగా ఏ రేటెడ్, కామోడీతో సాగుతూ యూత్‌ను బాగానే ఆకకట్టుకుంది. ఆ నేపథ్యంలో మేకర్స్ ఈ సిరీస్‌కు సెకండ్ సీజన్ సిద్ధం చేశారు. డైరెక్టర్ మారుతీ (Maruthi) షో రన్నర్‌గా వ్యవహరిస్తున్న ఈ వెబ్ సిరీస్‌కు రవి నంబూరి (Ravi Namburii), సందీప్ బొల్ల (Sandeep Bolla)రచన చేయగా, కిరణ్ కె కరవల్ల (Kiran K Karavalla) దర్శకత్వం వహించారు. ప్రముక నిర్మాత SKN నిర్మించారు.
ఈ క్రమంలో ఈ సీజన్‌లో కీలక పాత్రలు పోషిస్తున్న పాత్రలకు సంబంధించిన గ్లిమ్స్ విడుదల చేస్తున్నారు. ఇప్పటికే నాయికలు కుషిత కల్లపు (Koushita Kallapu) , రాశిసింగ్ క్యారెక్టర్లను పరిచయం చేస్తూ వీడియోలు రిలీజ్ చేయగా తాజాగా మంగళవారం పాపులర్ కమెడియన్ సత్య (Satya) పాత్ర బెట్టింగ్ భోగి (Betting Bhog)కి సంబంధించిన వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియో ఆద్యంతం సత్య మార్కు కామెడీ పంచులతో, ఐపీఎల్ బెట్టింగ్ మీద సెటైర్లతో అదరగొట్టారు. ఒక్కసారి చూసిన వారు పదే పదే చూసి కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. మీరు ఇంతవరకు చూడకుంటే చూసి ఎంజాయ్ చేయండి. డోంట్ మిస్.