సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

MassJathara OTT: మాస్ మ‌హారాజ్‌.. ఓటీటీకి వ‌చ్చేస్తున్నాడు! గెట్ రెడీ

ABN, Publish Date - Nov 24 , 2025 | 08:05 PM

ఎన్నో అంచ‌నాల న‌డుమ గ‌త నెల చివ‌ర‌న థియేట‌ర్ల‌కు వ‌చ్చి ప్రేక్ష‌కుల‌ను నిరావ ప‌ర్చిన ర‌వితేజ చిత్రం మాస్ జాత‌ర (MassJathara ) డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు సిద్ద‌మైంది.

MassJathara

ఎన్నో అంచ‌నాల న‌డుమ గ‌త నెల చివ‌ర‌న థియేట‌ర్ల‌కు వ‌చ్చి ప్రేక్ష‌కుల‌ను నిరావ ప‌ర్చిన ర‌వితేజ (RaviTeja) చిత్రం మాస్ జాత‌ర (MassJathara ). (Sreeleela) క‌థానాయిక‌గా న‌టించ‌గా న‌వీన్ చంద్ర‌, రాజేంద్ర ప్ర‌సాద్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. వాల్తేరు వీర‌య్య‌, సామ‌జ వ‌ర‌గ‌మ‌న వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల‌కు డైలాగ్స్ అందించి గుర్తింపును ద‌క్కించుకున్న భాను భోగవరపు (Bhanu Bhogavarapu) ఈ మూవీతో ద‌ర్శ‌కుడిగీ ఎంట్రీ ఇచ్చాడు. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ నిర్మించింది. అయితే.. ఇప్పుడు ఈ చిత్రం నెల తిర‌క్కుండానే డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు సిద్ద‌మైంది.

క‌థ విష‌యానికి వ‌స్తే.. లక్ష్మణ్‌ భేరీ (రవితేజ) నిఖార్సైన రైల్వే పోలీస్ అఫీస‌ర్‌. త‌రుచూ ట్రాన్స్‌ఫ‌ర్ చేయ‌బ‌డుతూ ఉంటాడు. ఎక్క‌డికి బ‌దిలీ అయినా రైల్వే స్టేష‌నే కాకుండా ఆ ఊరి మొత్తాన్ని శుద్ది చేస్తుంటాడు. ఈ నేప‌థ్యంలో కొత్త‌గా ఉత్తరాంధ్రలోని అడవివరం అనే విలీజ్‌కు ఎంట్రీ ఇస్తాడు. అక్కడ శివుడు నవీన్ చంద్ర (Naveen Chandra) భారీ స్థాయిలో గంజాయి వ్యాపారం చేస్తూ పెద్ద సామ్రాజ్య‌మే సృష్టిస్తాడు. ఈ క్ర‌మంలో అక్క‌డ కొత్త‌గా విధుల్లో చేరిన హీరో లక్ష్మణ్‌ శివుడి ఆట ఎలా క‌ట్టించాడు, ఎటువంటి ఫ‌లితాలు ఎదుర్కోవాల్సి వ‌చ్చింద‌నే పాయింట్‌తో లాజిక్ లెస్‌ సినిమా సాగుతుంది.

అయితే.. గ‌త ర‌వితేజ సినిమాల మాదిరి రోటిన్‌ క‌థ క‌థ‌నాలు ఉంట‌డం, ఎక్క‌డా కొత్త‌ద‌నం అనే మాటే లేకుంగా సినిమా సాగుతుంది. ఇప్పుడీ సినిమా న‌వంబ‌ర్ 27 గురువారం నుంచి నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఓటీటీలో తెలుగుతో పాటు ఇత‌ర భాష‌ల్లోనూ స్ట్రీమింగ్ అవ‌నుంది. థియేట‌ర్ల‌లో మిస్స‌యిన వారికి, ర‌వితేజ అభిమానుల‌కు ఇప్పుడు గొల్డ‌న్ ఛాన్స్.. ఇక ఇంట్లోనే సినిమాను ఆస్వాదించ‌వ‌చ్చు.

Updated Date - Nov 24 , 2025 | 08:23 PM