Lal Salaam OTT: హమ్మయ్యా.. మొత్తానికి రజనీకాంత్ సినిమా ఓటీటీకి వచ్చింది! కానీ
ABN , Publish Date - Jun 06 , 2025 | 09:47 AM
రజనీకాంత్ నటించిన లాల్ సలామ్ సినిమా ఎట్టకేలకు ఓటీటీకి వచ్చింది. కానీ
జైలర్ వంటి అదిరిపోయే బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత కూతురు ఐశ్వర్య (Aishwarya Rajinikanth) దర్శకత్వంలో రెండో సారి రజనీకాంత్ (Rajinikanth) కీలక పాత్రలో నటించిన చిత్రం లాల్‌సలామ్ (Lal Salaam). భారీ చిత్రాల నిర్మాణ సంస్థ లైకా ప్రోడక్షన్ (Lyca Productions) ఈ చిత్రాన్ని నిర్మించగా విష్ణు విశాల్ (Vishnu Vishal), అనంతిక సనీల్‌కుమార్ (Ananthika Sanilkumar), ధన్య బాలకృష్ణ, జీవిత రాజశేఖర్, విక్రాంత్ ప్రధాన పాత్రల్లో లెజండరీ క్రికెటర్ కపిల్ దేవ్ అతిథి పాత్రలో నటించారు. ఆస్కార్ గ్రహీత రెహమాన్ (A.R.Rahman) సంగీతం అందించారు. గత సంవత్సరం ఫిబ్రవరిలో 9న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం రజనీ కెరీర్‌లోనే భారీ డిజాస్టర్‌గా నిలిచింది. సుమారు రూ. 90 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం కేవలం రూ.20 కోట్ల లోపే వసూళ్లు రాబట్టి సూపర్‌స్టార్‌కు కేరీర్‌లో మాయని మచ్చలా మిగిలింది.
అయితే.. ముందస్తు అగ్రిమెంట్ మేరకు 30 రోజుల్లోనే ఓటీటీలో స్ట్రీమింగ్ కావాల్సి ఉండగా ఈ మూవీకి సంబంధించిన హార్డ్ డిస్క్ మాయం కావడంతో డిజిటల్ స్ట్రీమింగ్ రద్దైంది. ఆపై అప్పుడు వస్తుంది, ఇప్పుడు వస్తుంది అంటూ కాలం వెళ్లదీశారు తప్పితే ఏడాదిన్నర గడిచి పోయింది. ఆ తర్వాత దీనికి సంబంధించిన అప్డేట్స్ పూర్తిగా బంద్ అవడంతో ఇక ఈ సినిమా లేనట్లేని అంతా ఆలోచించడమే మరిచిపోయారు. ఈ క్రమంలో సడన్‌గా వారం క్రితం ఈ చిత్రం హార్డ్ డిస్క్ దొరకింది అంటూ ప్రకటించి, వెంటనే స్ట్రీమింగ్ డేట్ ప్రకటించడం అన్నీ చకచకా జరిగిపోయాయి. అంతేగాక థియేటర్‌లో విడుదలైన వర్షన్ కాకుండా ఎక్స్టెన్షన్ వర్షన్‌ను డిజిటల్ స్ట్రీమింగ్‌కు తీసుకు వస్తునట్లు ప్రకటించారు.
కథ విషయానికి వస్తే.. 1993 సంవత్సరం నేపథ్యంలో సాగే ఈ మూవీలో మొయిద్దీన్ (రజినీకాంత్), గురు తండ్రి (ఫిలిప్ లివింగ్‌స్టోన్ జోన్స్) ఇద్దరు మంచి ప్రాణ స్నేహితులు. చెన్నైలోని ఓ ప్రాంతంలో హిందు, ముస్లింలు ఐక్యంగా కలిసి ఉండేవారు. ఆయితే ఓరోజు ఆ ఊరిలో జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో మొయిద్దీన్ (రజినీ కాంత్) కొడుకు శంషుద్దీన్ (విక్రాంత్) చేతిని, గురు (విష్ణు విశాల్) నరికేస్తాడు. దీంతో రెండు మతాల మధ్య గొడవలు ప్రారంభమవుతాయి. ఆ గొడవలను అక్కడి పొలిటీషియన్లు తమకు అనుకూలంగా వాడుకుందామని చూస్తుంటారు. ఈక్రమంలో తన కొడుకు చేతిని ప్రాణ స్నేహితుడి కుమారుడు నరికేస్తే మొయిద్దీన్ ఏమి చేశాడు? రంజీకి సెలెక్ట్ అయి చెయ్యి పొగొట్టుకున్న శంషుద్దీన్ ఏమి చేశాడు? అసలు గురు, శంషుద్దీన్ మధ్య గొడవకు కారణం ఏంటి? ఆ ఊర్లో సంవత్సరానికి ఒకసారి జరిగే అమ్మవారి పండగకి రథం కోసం ఏం చేశారు? మొయిద్దీన్ ఈ రెండు కుటుంబాలని ఎలా రక్షించుకున్నాడు, మత సామరస్యాన్ని ఎలా చాటారు అన్నదే ప్రధాన కథ.
అయితే.. షూటింగ్ దశ నుంచే అనేక వివాదాల్లో చిక్కుకుంది.ఆపై సినిమా పూర్తి చేసే క్రమంలో బడ్జెట్ విషయంలోనూ తడబడ్డారు. ఆపై రిలీజ్‌కు ముందే ఈ సినిమాపై అరబ్ దేశాలు నిషేధం విధించడం, కొన్ని సందర్భాల్లో దర్శకురాలు, నటులు చేసిన ప్రసంగాలు మూవీ విడుదలపై, ఆ తర్వాత కూడా కలెక్షన్లపై భారీ ప్రభావం చూపాయి. తెలుగు రాష్ట్రమే కాక తమిళంలోనూ మొదటి రోజు నుంచే తీవ్ర నెగిటీవిటీ తెచ్చుకుని అట్టర్ ఫ్లాప్‌గా మిగిలింది. ఇదిలాఉంటే రజనీ కాంత్ కీలక పాత్ర అని ప్రచారం చేసినా సినిమాలో ఆయన పాత్ర నిడివి ఎక్కువగానే ఉంటుంది. అంతేగాక నాటి హీరోయిన్ జీవిత రాజశేఖర్ చాలా కాలం తర్వాత ఓ ప్రధాన పాత్రలో నటించడం విశేషం. ఎవరైతే నాడు థియేటర్లలో ఈ లాల్‌సలామ్ (Lal Salaam) సినిమాను చూడడం మిస్ అయ్యిన వారు, రజనీ అభిమానులు ఒక్కసారి ఈ మూవీ చూడవచ్చు. ఇప్పుడు ఈ మూవీ జూన్ 6 శుక్రవారం నుంచి సన్ నెక్ట్స్ ఓటీటీలో కేవలం తమిళంలో మాత్రమే అందుబాటులో ఉంది. తెలుగులో రావడానికి మరి కొద్ది సమయం పట్టనుంది.
ఇవి కూడా చదవండి..
ఓ రోజు ముందే తెలుగులోనూ ఓటీటీకి వచ్చిన.. అదిరిపోయే హిందీ యాక్షన్ థ్రిల్లర్
సడన్‌గా ఓటీటీకి.. స్పైన్ చిల్లింగ్ సర్వైవల్ హర్రర్‌థ్రిల్లర్! ఎందులో చూడాలంటే
ఆరేండ్ల తర్వాత తెలుగులో.. ఓటీటీకి వచ్చిన దుల్కర్ సల్మాన్ కామెడీ థ్రిల్లర్
రెండు నెలల తర్వాత ఓటీటీకి.. సప్తగిరి పెళ్లి కాని ప్రసాద్! ఎందులో అంటే
సడన్‌గా ఓటీటీకి.. హాలీవుడ్ లేటెస్ట్ బోల్డ్, హర్రర్ థ్రిల్లర్! ఎందులో చూడాలంటే
సడన్‌గా.. ఓటీటీకి వచ్చి షాకిచ్చిన శ్రీవిష్ణు సింగిల్! ఎందులో అంటే