సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Premante: ఓటీటీకి ప్రేమంటే.. స్ట్రీమింగ్ ఎక్కడంటే 

ABN, Publish Date - Dec 14 , 2025 | 11:04 AM

ప్రియదర్శి (Priyadarshi Pulikonda), ఆనంది జంటగా నటించిన చిత్రం ‘ప్రేమంటే’. నవనీత్‌ శ్రీరామ్‌ తెరకెక్కించిన రొమాంటిక్‌ కామెడీ మూవీ నవంబరులో థియేటర్లలో విడుదలైంది.

ప్రియదర్శి (Priyadarshi Pulikonda), ఆనంది జంటగా నటించిన చిత్రం ‘ప్రేమంటే’. నవనీత్‌ శ్రీరామ్‌ తెరకెక్కించిన రొమాంటిక్‌ కామెడీ మూవీ నవంబరులో థియేటర్లలో విడుదలైంది. ఇప్పుడు ఓటీటీ విడుదల తేదీ ఫిక్స్ అయింది. ‘నెట్‌ఫ్లిక్స్‌’(Netflix)లో ఈ నెల 19 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్నీ సోషల్‌ మీడియా వేదికగా ‘నెట్‌ఫ్లిక్స్‌’ సంస్థ  ప్రకటించింది. సుమ కనకాల, వెన్నెల కిశోర్‌, హైపర్‌ ఆది తదితరులు కీలక పాత్రల్లో సందడి చేశారు.

కథ:
మది అలియాస్‌ మధుసూదన్‌ (ప్రియదర్శి) సెక్యూరిటీ సిస్టం మేనేజ్‌మెంట్‌ చేస్తుంటాడు. ఇది ఒక పక్క.. రెండో పక్క అతనొక దొంగ. అయితే తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి.. కుటుంబం పట్ల బాధ్యతగా వ్యవహరించాలనుకుంటాడు. ఓ పెళ్లిలో తారసపడిన అమ్మాయి రమ్య (ఆనంది)పై మనసు పారేసుకుంటాడు. ఆమె చేసే ప్రతి పనిలో థ్రిల్‌ కోరుకుంటుంది. ఇద్దరి అభిరుచులు కలవడం, ఇరు కుటుంబాలు అంగీకరించడంతో పెళ్లి చేసుకుంటారు. కొన్ని రోజుల తర్వాత భర్త ఏం చేస్తాడో రమ్యకు తెలిసిపోతుంది. దొంగతనాలకు స్వస్తి చెప్పి ఉద్యోగం చేయమనడంతో అటువైపు అడుగేస్తాడు మది. దొంగతనాలు వద్దు అన్న భార్యే మళ్లీ దొంగతనాల వైపు ఎందుకు మొగ్గు చూపింది. పెళ్లి తర్వాత వీరిద్దరి జీవితం సాఫీగా సాగిందా? థ్రిల్‌ కోరుకునే రమ్యకు జీవితం థ్రిల్లింగ్‌గా అనిపించిందా? ఇందులో పోలీస్‌ హెడ్‌ కానిేస్టబుల్‌ ఆశా మేరీ (సుమ కనకాల) పాత్ర ఏంటి? ఆమె వీరిద్దరి జీవితంలోకి ఎందుకు వచ్చింది? అన్నది కథ.

ALSO READ:  Anil Ravipudi: చిరంజీవి నుంచి ఆశించే అన్ని అంశాలతో వస్తున్నాం..

Dhandoraa Song: సామాజిక అస‌మాన‌త‌ల‌ను ప్ర‌శ్నిస్తోన్న ‘దండోరా’ సాంగ్

Pradeep Ranganathan: హీరోయిన్లు ముఖం మీదే ‘నో’ అనేశారు

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్.. రోజుకు 20 గంటలు

Updated Date - Dec 14 , 2025 | 09:35 PM