Anil Ravipudi: చిరంజీవి నుంచి ఆశించే అన్ని అంశాలతో వస్తున్నాం..
ABN , Publish Date - Dec 14 , 2025 | 10:54 AM
'సంక్రాంతికి వస్తున్నాం'తో పోల్చుకుంటే స్టోరీ పరంగా కొంచెం డెప్త్ ఉన్న సినిమా ఇది. ఈ జనరేషన్ కి ఒక అప్డేటెడ్ వెర్షన్ తో చిరంజీవి గారు మన ముందుకు రాబోతున్నారు.
'సంక్రాంతికి వస్తున్నాం'తో పోల్చుకుంటే స్టోరీ పరంగా కొంచెం డెప్త్ ఉన్న సినిమా ఇది. ఈ జనరేషన్ కి ఒక అప్డేటెడ్ వెర్షన్ తో చిరంజీవి(Chiranjeevi) గారు మన ముందుకు రాబోతున్నారు. ఫన్, డాన్సులు, యాక్షన్ అన్నీ చాలా బాగా కుదిరాయి. ఈ సంక్రాంతికి సూపర్ ఎంటర్టైనర్ ఇది' అని అనిల్ రావిపూడి అన్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆయన దర్శకత్వం వహిస్తున్న మాస్-అండ్-ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'మన శంకర వర ప్రసాద్ గారు' (Mana Shankara Vara Prasad Garu). నయనతార కథానాయిక. విక్టరీ వెంకటేష్ కీలకమైన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. శనివారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విడుదల తేదీని ఖరారు చేశారు, జనవరి 12న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
ఇంకా ఈ ఎమోషన్ లోనే ఉన్నాను: అనిల్ రావిపూడి
'ఒక తరం ప్రేక్షకుల్ని ఊపేసిన, కొన్ని దశాబ్దాలుగా అలరిస్తున్న మూలస్తంభాల్లాంటి కథానాయకులు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున. వీళ్లలో ఏ ఇద్దరు కలిసి కనిపించినా చూడాలనే కల ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. చిరంజీవి, వెంకటేశ్‌ని కలిసి చూపించే అవకాశం నాకు ఈ సినిమాతో లభించింది. మేలో సినిమా మొదలుపెట్టాం. చిరంజీవి గారితో ఓపెనింగ్ ముహూర్తంతో స్టార్ట్ చేశాం. అక్కడ్నుంచి ఈ ఏడు ఎనిమిది నెలలో జర్నీ నాకు చాలా మెమొరబుల్. నిన్న ఆయనతో లాస్ట్ వర్కింగ్ డే. నేను ఇంకా ఆ ఎమోషన్ లోనే ఉన్నాను. ఒకరినొకరు మిస్ అవుతున్నామనే ఫీలింగ్ ఇద్దరిలో ఉంది. సంక్రాంతితో నాకు మంచి అనుబంధం ఉంది. ఎఫ్2, సరిలేరు నీకెవ్వరు, సంక్రాంతికి వస్తున్నాం.. ఇప్పుడు ఇది నా నాలుగో సంక్రాంతి. నాకెప్పుడూ సంక్రాంతి అంటే ఒత్తిడి ఉండదు. గత సంక్రాంతికి మీరు ఎంత ఎనర్జీ ఎంజాయ్ చేశారో, అలాంటి ఎంజాయ్ మెంట్ ఈ సంక్రాంతి కూడా మీకు దొరుకుతుంది. వెంకటేష్ గారు నాకు చాలా ప్రత్యేకమైన హీరో. ఆయన నా గురువు. ఈ వేడుక ఆయన బర్త్డే రోజు జరగడం చాలా ఆనందంగా ఉంది. ఇందులో ఆయన ఇరవై నిమిషాలు కనిపిస్తారు. చిరంజీవి గారితో పాటు ఉంటుంది. చిరంజీవి గారు వెంకటేష్ గారిని దశాబ్దాలుగా వారిని మనం చూస్తూ వస్తున్నాం. అలాంటి ఇద్దరినీ ఒక ఫ్రేమ్ లో చూడాలనేది సినీ లవర్స్ కి ఒక డ్రీమ్ ఉంటుంది. అలాంటి అవకాశం నాకు దొరికింది. చిరంజీవి, వెంకటేష్ ఎలా ఎంటర్టైన్ చేయబోతున్నారనేది మీకు చూపించడానికి చాలా ఎక్సయిటెడ్ గా ఉన్నాను. నిర్మాతలతో ఎంతో ఫ్రెండ్లీగా పని చేశా. సుస్మితకు చిరంజీవి గారు కుమార్తె అనే ఫీలింగే ఉండదు. చిరంజీవి, నయనతార అలాగే ఇందులో ఇద్దరు పిల్లలు ఉంటారు, వాళ్లకి చిరంజీవి గారికి వుండే ఎమోషన్ చాలా కనెక్టింగ్ గా వుంటాయి. ఎంటర్టైన్మెంట్ తో పాటు అద్భుతమైన డ్రామా ఉంటుంది. ఇందులో చిరంజీవి గారిని చూసిన ఫస్ట్ ప్రైమ్ లోనే మనం సర్ప్రైజ్ అయిపోతాం. చిరంజీవి గారిని ఆడియన్స్, ఫ్యాన్స్ ఎలా కోరుకుంటారో అలా చూపించడానికి 100% ఎఫర్ట్ పెట్టాను' అని అన్నారు.
అనుమానం అవసరం లేదు: సాహు గారపాటి
'మేము అనుకున్న సమయానికి ఫినిష్ చేశాం. సినిమా మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చిన చిరంజీవి గారికి, మేము అడగగానే చేసిన వెంకటేష్ గారికి ,అన్ని పర్ఫెక్ట్ గా క్రాఫ్ట్ చేసిన మా డైరెక్టర్ అనిల్ గారికి ధన్యవాదాలు. ఈ సినిమా సంక్రాంతికి ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. అందులో ఎలాంటి అనుమానం అవసరం లేదు. చిరంజీవి గారిని 30 ఏళ్ల క్రితం ఎలా చూసామో అలానే ఉన్నారు. అలాగే డాన్స్ లు చేశారు. అభిమానులకి ఒక పండగ లాంటి సినిమా ఇది. ఇండస్ట్రీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుంది' అని అన్నారు.
అప్పుడే పండగ మొదలైనట్లుంది; సుష్మిత కొణిదెల
ప్రొడ్యూసర్ సుస్మిత కొణిదెల మాట్లాడుతూ..ఈ ఈవెంట్ చూస్తుంటే మా చుట్టాలు అందరితో కు వెయిట్ చేయలేకపోతున్నట్టుగా ఉంది. సంక్రాంతికి సినిమా రిలీజ్ చేయడం అనేది ప్రతి ప్రొడ్యూసర్ కి ఒక కల. నా మొదటి సినిమా అదీ చిరంజీవి గారితో సంక్రాంతికి వస్తుందంటే అది ఎంత పెద్ద కలో నేను ఊహించుకోలేకపోతున్నాను. ఆ కలని మరింత పెద్దగా చేసుకుని సంక్రాంతికి ట్రేడ్ మార్క్ గా నిలిచిన డైరెక్టర్ అనిల్ గారితో రావడం మరింత ఆనందాన్నిస్తుంది. మెగాస్టార్ నుంచి అభిమానులు ఆశించే గ్రేస్ స్టైల్ పూర్తి స్థాయిలో ఎంటర్టైన్మెంట్ అన్నీ ఇందులో మూడింతలు వుంటాయి. ఈ సినిమా ఒక ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉండబోతుంది. ఇది నా గ్యారెంటీ' అని అన్నారు.
ALSO READ: Anil Ravipudi: చిరంజీవి నుంచి ఆశించే అన్ని అంశాలతో వస్తున్నాం..
Premante: ప్రేమంటే స్ట్రీమింగ్ ఎక్కడంటే
Dhandoraa Song: సామాజిక అసమానతలను ప్రశ్నిస్తోన్న ‘దండోరా’ సాంగ్
Pradeep Ranganathan: హీరోయిన్లు ముఖం మీదే ‘నో’ అనేశారు
Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్.. రోజుకు 20 గంటలు