సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Panchayat: పంచాయత్‌ సీజన్‌ 5 వచ్చేది ఎప్పుడంటే..

ABN, Publish Date - Jul 07 , 2025 | 08:29 PM

పంచాయత్‌ ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకున్న వెబ్‌ సిరీస్‌ . ఇప్పటికే నాలుగు సీజన్లతో ప్రేక్షకుల్ని కట్టిపడేసింది.

Panchayat season 5

‘పంచాయత్‌’ (Panchayat) ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకున్న వెబ్‌ సిరీస్‌ (web series). ఇప్పటికే నాలుగు సీజన్లతో ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. ఇప్పుడు ‘పంచాయత్‌ సీజన్‌ 5’ (panchayat 5) రెడీ అవుతోంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’ (Prime video) కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. 2026 ప్రథమార్థంలో ఈ సిరీస్‌ స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్లు తెలిపింది.



ఓటీటీల్లో యాక్షన్‌, క్రైమ్‌, సస్పెన్స్‌కు బాగా అలవాటు పడిన ప్రేక్షకుల పల్లెను గుర్తు చేసిందీ సిరీస్‌. పల్లెలోని స్వచ్ఛమైన గాలిని అందించింది. ఓ గ్రామీణ వాతావరణం, ఊరి సమస్యలు, మూఢనమ్మకాలు లాంటి అంశాలతో రూపొందిందీ సిరీస్‌. దీనిని వీక్షించిన ప్రతి ప్రేక్షకుడు ఇది మన కథే కదా అనుకున్న సందర్భాలు ఉన్నాయి. త్వరలో రాబోతున్న ఐదో సీజన్‌ కూడా అంతకుమించి ఉంటుందని చెబుతున్నారు మేకర్స్‌. జితేంద్ర కుమార్‌, నీనా గుప్తా, రఘుబీర్‌ యాదవ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. దీపక్‌ కుమార్‌ మిశ్రా, అక్షత్‌ సంయుక్తంగా తెరకెక్కించారు. సీజన్‌4లో ఫులేరా గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సాగింది. ‘సీజన్‌5’ కథ, కథనాలు ఎలా ఉంటాయో తెలియాలంటే మరి కొన్ని రోజులు ఎదురుచూడాల్సిందే.

Updated Date - Jul 07 , 2025 | 08:50 PM