Pawan Kalyan: ఓటీటీలో నిరాశ.. నాని ‘హిట్ 3’ని క్రాస్ చేయలేక పోయిన ‘ఓజీ’
ABN, Publish Date - Oct 30 , 2025 | 03:39 PM
పవన్ కళ్యాణ్ తాజా చిత్రం 'ఓజీ' ఇటీవల నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయ్యింది. ఫస్ట్ వీక్ వ్యూవర్స్ విషయంలో 'ఓజీ'... 'పుష్ప-2, కల్కి 2898 ఎ.డి., హిట్ -3 తర్వాత స్థానంలో నిలిచింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) 'ఓజీ' (OG) మూవీ ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తోంది. నెట్ ఫ్లిక్స్ (Netfilx) లో ఈ సినిమాకు వ్యూవర్స్ నుండి విశేష స్పందన లభిస్తోంది. 'ఓజీ' సినిమాకు 'ఎ' సర్టిఫికెట్ ఇవ్వడంతో 18 సంవత్సరాల లోపు వయసు ఉన్న వాళ్ళు దీనిని చూడలేక పోయారు. వాళ్ళంతా ఇప్పుడీ సినిమాను ఓటీటీలో చూసే ఛాన్స్ లభించింది. దాంతో గడిచిన వారంలో 'ఓజీ'కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అప్పటి వరకూ ఉన్న హాలీవుడ్, బాలీవుడ్ చిత్రాలను వెనక్కినెట్టి 'ఓజీ' ముందుకు సాగింది.
ఇక తెలుగు సినిమాల విషయానికి వస్తే... తొలివారంలో అత్యధికులు వీక్షించిన పాన్ ఇండియా మూవీగా 'పుష్ప-2' (Pushpa -2) సినిమా నిలిచింది. ఈ సినిమా ఫస్ట్ వీక్ లో ఓటీటీలో 5.8 మిలియన్ వ్యూస్ ను అందుకుంది. అలానే ఆ తర్వాత స్థానాన్ని 'కల్కి 2898 ఎ.డి'కి (Kalki 2898 A.D) దక్కింది.
ఈ సినిమాను ఫస్ట్ వీక్ ఓటీటీలో 4.5 మిలియన్ వ్యూవర్స్ చూశారు. దీని తర్వాత స్థానం నాని నటించిన 'హిట్ -3' (Hit -3) పొందింది. ఈ సినిమాను అప్పట్లో 4.2 మిలియన్ వ్యూవర్స్ చూడటం జరిగింది. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'ఓజీ'ని 3.2 మిలియన్ వ్యూవర్స్ మాత్రమే మొదటి వారం చూశారు.
'ఓజీ'లానే 'హిట్ -3' సైతం 'ఎ' సర్టిఫికెట్ పొందిన సినిమా. ఈ సినిమాను కూడా వ్యూవర్స్ వయసుతో నిమిత్తం లేకుండా ఓటీటీలో చూశారు. ఇక 'ఓజీ' తర్వాత స్థానంలో 2.9 మిలియన్ వ్యూస్ తో విజయ్ దేవరకొండ కింగ్ డమ్ మూవీ నిలిచింది.
దీని తర్వాత స్థానంలో 'డాకు మహరాజ్ (2.6 మిలియన్ వ్యూస్), 'దేవర' (2.2 మిలియన్ వ్యూస్), 'గుంటూరు కారం' (2.0 మిలియన్ వ్యూస్)ను పొందాయి. ఓవర్ ఆల్ గా చూస్తే... నాని నటించిన సినిమాలకు థియేటర్లలో క్రేజ్ ఎలా ఉన్నా... ఓటీటీలో మాత్రం అతని సినిమాలకు మంచి ఆదరణే లభిస్తోంది. మరి నాని రాబోయే చిత్రం 'ది ప్యారడైజ్'కు ఎలాంటి స్పందన లభిస్తుందో చూడాలి.
Also Read: De De Pyaar De 2: ఓరి దేవుడో... రకుల్ వైబ్ మామూలుగా లేదుగా...
Also Read: Bahubali The Epic Review: ‘బాహుబలి: ది ఎపిక్' గౌతమ్ ఘట్టమనేని రివ్యూ ఇదే