Bahubali The Epic Review: ‘బాహుబలి: ది ఎపిక్' గౌతమ్ ఘట్టమనేని రివ్యూ ఇదే
ABN , Publish Date - Oct 30 , 2025 | 02:21 PM
తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన చిత్రం 'బాహుబలి'. రెండు పార్టులుగా విడుదలైన ఈ చిత్రాన్ని 'బాహుబలి : ది ఎపిక్' పేరుతో మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు దర్శక నిర్మాతలు.
తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన చిత్రం 'బాహుబలి'. రెండు పార్టులుగా విడుదలైన ఈ చిత్రాన్ని 'బాహుబలి : ది ఎపిక్' (Baahubali: The Epic) పేరుతో మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు దర్శక నిర్మాతలు. రెండు భాగాలు కలిపి ఒకే భాగంగా ‘బాహుబలి: ది ఎపిక్’ పేరుతో అక్టోబర్ 31న ఈ సినిమా రీ రిలీజ్ కానుంది. దీంతో సోషల్ మీడియాలో సందడి నెలకొంది. ఇప్పటికే ప్రీ బుకింగ్స్‌లో జోరు కొనసాగుతోంది. ‘బాహుబలి: ది ఎపిక్’ రన్‌టైమ్ 3:45 గంటలు అని రాజమౌళి చెప్పారు. రెండు భాగాలు కలిపి విడుదల చేసిన నేపథ్యంలో అవంతిక లవ్‌స్టోరీ, పచ్చబొట్టేసిన పాట, ఇరుక్కుపో సాంగ్, కన్నా నిదురించరా సాంగ్, యుద్ధానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలను తొలగించామని తాజా ఇంటర్వ్యూలో తెలిపారు. ఐతే ఓవర్సీస్‌లో ఒకరోజు ముందే ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. అక్కడ ఈ సినిమా చూసిన మహేశ్‌బాబు కుమారుడు గౌతమ్ (Gautham Ghattamaneni) ప్రశంసలు కురిపించారు.
‘ప్రపంచంలోనే అతి పెద్ద థియేటర్‌లో ‘బాహుబలి: ది ఎపిక్’ని చూడడం ఎప్పటికీ మర్చిపోలేని అనుభవం. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలుసుకోవడం కోసం ఇప్పుడు రెండేళ్లు వేచిచూడాల్సిన అవసరం లేదు. ఎడిట్ చేసిన తర్వాత సినిమా మరింత అద్భుతంగా ఉంది. తెలుగు సినిమాకు అంతర్జాతీయంగా ఇంత ఆదరణ దక్కడం చాలా ఆనందంగా ఉంది. నేను ఈ సినిమాలు చూస్తూ పెరిగాను. ఇప్పుడు ఈ రెండు భాగాలను ఒకేసారి చూడడం కొత్తగా అనిపించింది. ఇదొక ఎపిక్ సినిమా. ప్రతి సెకనుకు గూస్‌బంప్స్ వస్తున్నాయి. ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేను. క్రేజీ ఫీలింగ్’ అని తెలిపారు.