Eleven OTT: ఓటీటీకి.. లేటెస్ట్ స్పైన్ చిల్లింగ్ థ్రిల్లర్! ఎందులో అంటే
ABN , Publish Date - Jun 08 , 2025 | 04:58 PM
ఇటీవల థియేటర్లలోకి వచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకుని మంచి విజయం సాధించిన చిత్రం ఎలెవన్.
ఇటీవల థియేటర్లలోకి వచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకుని మంచి విజయం సాధించిన చిత్రం ఎలెవన్ (Eleven). క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ జానర్‌లో మే16న తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన చిత్రం పాతిక రోజులకే అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. నవీన్ చంద్ర (Naveen Chandra) కథానాయకుడిగా నటించగా రేయ హరి (Reyaa Hari), అభిరామి (Abhirami) కీలక పాత్రల్లో నటించారు. ప్రముఖ డైరెక్టర్ సుందర్ సీ వద్ద అనేక సినిమాలకు అసిస్టెంట్‌గా పనిచేసిన లోకేశ్ అజిల్స్ (Lokkesh Ajls) రచన, దర్శకత్వం చేశారు. ఇటీవల వెబ్ సిరీస్‌లలో వరుస హిట్లతో మంచి క్రేజ్ తో దూసుకెళుతూ థ్రిల్లర్ సినిమాలంటే తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ సంపాందించుకున్న
కథ విషయానికి వస్తే.. అరవింద్ (నవీన్ చంద్ర) విశాఖలో అసిస్టెంట్ కమిషనర్‌గా, స్మార్ట్ పోలీసుగా మంచి గుర్తింపును తెచ్చుకుంటాడు. అయితే నగరంలో జరుగుతున్న వరుస హత్యల కేసుని డీల్ చేస్తున్న పోలీస్ అధికారి రంజిత్ (శశాంక్) రోడ్డు ప్రమాదానికి గురవడంతో ఆ బాధ్యత అరవింద్ తీసుకుంటాడు. ఆపై కూడా వరుస హత్యలు కొనసాగుతూనే ఉన్నా హంతకుడు, హత్యకి గురైనవాళ్ల ఆనవాళ్లు ఆధారాలు ఎంతకీ లభించవు. చివరకు ఆరో హత్య దగ్గర ఓ చిన్న క్లూతో కేసులో కదలిక వస్తుంది. హత్యకు గురైన వాళ్ల ఆచూకీ ఒక్కొక్కరిగా బయటకు వస్తాయి. కానీ హత్యలు చేసేది ఎవరనే విషయం మాత్రం అంతుబట్టదు.
చివరకు అరవింద్ ఆ హంతుకుడిని పట్టుకున్నాడా? అతను ఈ దారుణాలు చేయడానికి కారణమేంటి? ట్విన్ బర్డ్ స్కూల్‌కి, 6 మంది కవలలకి ఈ హత్యలకు సంబంధం ఏంటి? ఈ కథలో బెంజిమన్ పాల్, ఫ్రాన్సిస్ ఎవరు? అన్నది కథ. సినిమా ఆరంభమైన 10 నిమిషాలలోనే ఇన్వెస్టిగేషన్ మొదలై.. ప్రేక్షకులకు స్పైన్ చిల్లింగ్ ఇస్తూ సినిమా ఆద్యంతం సస్పెన్స్ తో ఆకట్టుకుంటుంది. సీరియల్ కిల్లర్ కథ, కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు భావోద్వేగం కలుగజేస్తాయి. ఫ్రీ ఇంటర్వెల్‌కు ముందే కిల్లర్ బయటపడ్డ చివర్లో వచ్చే ట్విస్టు సైతం గూస్‌బమ్స్ తెచ్చేలా ఉంటుంది. ఇప్పుడీ సినిమా జూన్ 13నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో స్ట్రీమింగ్ అవనుంది. థియేటర్లలో మిస్సయిన వారు, మంచి థ్రిల్లర్ చిత్రం చూడాలనుకునే వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఎలెవన్ (Eleven) సినిమాను మిస్ అవకుండా చూసి ఎంజాయ్ చేయవచ్చు.