Mothevari Love Story: మోతెవరి లవ్ స్టోరీ.. ట్రైలర్ వచ్చేసింది
ABN, Publish Date - Jul 27 , 2025 | 05:45 PM
మై విలేజ్ షో అనీల్ హీరోగా నటించిన మోతెవరి లవ్ స్టోరీ వెబ్ సిరీస్ ట్రైలర్ విడుదలైంది.
మై విలేజ్ షో అనే యూట్యూబ్ ఛానల్ అందులోని కంటెంట్‌తో రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఛానల్ నుంచి వచ్చిన గంగవ్వ, అంజి మామ ఇప్పటికే మంచి గుర్తింపు దక్కించుకుని సినిమాలు కూడా చేస్తూ బిజీగా ఉన్నారు. ఇప్పుడు అదే వరుసలో ఇప్పుడు అదే టీమ్ నుంచి మెయిన్ లీడ్ నటుడైన అనీల్ జీలా (Anil jeela) ఇప్పుడు హీరోగా ఓటీటీలో ఆరంగేట్రం చేస్తున్నాడు. ఇప్పటికే పలు సినిమాల్లోనూ నటించిన ఆయన మై విలేజ్ షో (My Village Show) టీమ్‌తో కలిసి ‘మోతెవరి లవ్ స్టోరీ’ (Mothevari Love Story) అనే వెబ్ సిరీస్‌తో త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు. వర్షిణి రెడ్డి జున్నుతుల (Varshini), సదన్న ప్రధాన పాత్రల్లో నటించారు.
అచ్చమైన, స్వచ్చమైన తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో ప్రేమ, హాస్యం వంటి ప్రధాన అంశాలతో తెరకెక్కిన ఈ సిరీస్‌కు శివ కృష్ణ బుర్రా దర్శకత్వం వహించాడు. ఆగష్టు 8 నుంచి జీ5 (ZEE 5) ఓటీటీలో డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఈ సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఏడు ఎపిసోడ్స్‌గా రాబోతోన్న ఈ విలేజ్ కామెడీ, లవ్ సిరీస్ అందరినీ ఆకట్టుకునేలా ఉండనున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. అంతేగాక ప్రతీ సీన్‌లో అచ్చ తెలంగాణ యాష, భాష, నడవడిక కనబడింది. ముఖ్యంగా అనీల్ జీలా, సదన్న, మురళీ ధర్ గౌడ్‌ల మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు అదిరి పోయేలా ఉన్నాయి.