సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Madhavan: వృద్ధుడిగా.. మాధ‌వ‌న్! డిఫ‌రెంట్ కంటెంట్‌తో.. వెబ్ సిరీస్ ‘లెగసీ’

ABN, Publish Date - Oct 30 , 2025 | 06:23 PM

విలక్షణ నటుడు ఆర్‌.మాధవన్‌, నిమిషా సజయన్‌ జంటగా నటించిన తమిళ వెబ్‌సిరీస్‌ ‘లెగసీ’ త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానుంది.

Madhavan

విలక్షణ నటుడు ఆర్‌.మాధవన్ (R. Madhavan), హీరోయిన్‌ నిమిషా సజయన్ (Nimisha Sajayan) జంటగా నెట్‌ఫ్లిక్స్‌ కోసం ‘లెగసీ’ (Legacy) పేరుతో ఓ తమిళ వెబ్‌సిరీస్‌ రూపుదిద్దుకుంది. చారుకేష్‌ శేఖర్ (Charukesh Sekar) దర్శకుడు. క్రిమినల్‌ నేపథ్యం కలిగిన ఒక వృద్ధుడు.. తన శక్తిమంతమైన మాఫియా సామ్రాజ్యం నుంచి తప్పించుకోలేని ఒక సమస్యలో చిక్కుకుంటారు.

దీంతో తనను, తన కుటుంబం, సామ్రాజ్యాన్ని రక్షించడం కోసం ఒక యువకుడిని దత్తత తీసుకుంటారు. ఆయన వృద్ధుడితో పాటు అతని కుటుంబాన్ని, నేర సామ్రాజ్యాన్ని రక్షించారా? లేదా? అన్నదే ఈ వెబ్‌ సిరీస్‌ స్టోరీ. త్వ‌ర‌లో నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రానుంది.

ఈ వెబ్ సిరీస్‌లో తన పాత్ర గురించి ఆర్‌.మాధవన్‌ మాట్లాడుతూ..‘ కథ ఆలకించే సమయంలోనే మనలో ఉన్న నటుడిని తట్టిలేపుతుంది. అలాంటి కథా చిత్రాల్లో నటించేందుకు ఉత్సాహం కలుగుతుంది. ఆ కారణంగానే ‘లెగసీ’ సిరీస్‌లో నటించేందుకు సమ్మతించాను. ఓటీటీ వేదికల్లో ఇప్పటివరకు వచ్చిన వెబ్ సిరీస్‌లకు పూర్తి భిన్నంగా ఉంటుంది.

దర్శకుడు చారుకేష్‌ శేఖర్‌, స్టోన్‌ బెంచ్‌ సంస్థతో కలిసి పని చేయడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ సిరీస్‌ ప్రతి ఒక్కరినీ ఆలరిస్తుందన్న నమ్మకం ఉందన్నారు. కాగా ఈ వెబ్ సిరీస్‌లో నిమిషా సజయన్ (Nimisha Sajayan) తో పాటు సీనియర్‌ దర్శకుడు గౌతం వాసుదేవ్‌ మేనన్‌, గుల్షన్‌ దేవయ్య, అభిషేక్‌ బెనర్జీ తదితరులు నటించారు.

Updated Date - Oct 30 , 2025 | 06:23 PM