OTT: గొర్రెలు కాచే యువకుడు.. లక్షల మంది ఆరాధించే రాజుగా ఎలా ఎదిగాడు! ఈ సీరిస్ అసలు వదలకండి! ఎందులో ఉందంటే
ABN, Publish Date - May 02 , 2025 | 02:59 PM
మనం ఇప్పటివరకు గల్లీ నుంచి ఢిల్లీ వరకు, చిన్న స్థాయి నుంచి వేల కోట్లకు పడగెత్తడం వంటి ఎన్నో కథలు విన్నాం, చూస్తున్నాం కూడా. ఈ కోవలోనే ఇప్పుడు తెలుసుకోబేయే సిరీస్
మనం ఇప్పటివరకు గల్లీ నుంచి ఢిల్లీ వరకు, చిన్న స్థాయి నుంచి వేల కోట్లకు పడగెత్తడం వంటి ఎన్నో కథలు విన్నాం, చూస్తున్నాం కూడా. ఈ కోవలోనే ఇప్పుడు తెలుసుకోబేయే సిరీస్ కూడా అలాంటి కథతో వచ్చిందే. అయితే ఇది క్రిస్తూ పూర్వం వెయ్యి సంవత్సరాల క్రిందట ఇజ్రాయిల్‌లో జరిగిన నిజ జీవిత కథతో బైబిల్ ఆధారంగా చారిత్రక నేపథ్యంలో తెరకెక్కించిన వెబ్ సిరీస్ అవడం విశేషం. హౌస్ ఆప్ డేవిడ్ (House of David) పేరుతో వచ్చిన ఈ సిరీస్ ఓటీటీలో విడుదలై మూడు నెలలు అయినా ఇంకా దీని గురించి చాలా మందికి తెలియదు అనడంతో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.
వారానికో ఎపిసోడ్ చొప్పున ఫిబ్రవరి 27 శుక్రవారం రోజున మొదలైన ఈ హౌస్ ఆప్ డేవిడ్ సిరీస్ తొలి సీజన్ ఏప్రిల్ 3వ తేదీ వరకు మొత్తంగా 8 ఏపిసోడ్‌లు ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చాయి. మైఖేల్ ఇస్కాండర్ (Michael Iskander), అలీ సులిమాన్ Ali Suliman, అవతార్ విలన్ స్టీఫెన్ లాంగ్ (Stephen Lang), అయెలెట్ జురేర్ (Ayelet Zurer), ఇండీ లూయిస్ (Indy Lewis) వంటి అమెరికన్‌తో పాటు, ఇజ్రాయిల్, పాలస్తీనా నటులు కీలక పాత్రల్లో నటించారు. జోన్ ఎర్విన్ (Jon Erwin), జోన్ గన్ (Jon Gunn), అలెగ్జాండ్రా లా రోచె (Alexandra La Roche), మైఖేల్ నంకిన్ (Michael Nankin) నలుగురు హాలీవుడ్ డైరెక్టర్లు దర్శకత్వం వహించారు.
అప్పటివరకు ఇజ్రాయిల్‌ను పాలిస్తున్న సౌల్ అనేక యుద్దాలు గెలుస్తూ ఎదురులేని రాజుగా పేరు తెచ్చుకుంటాడు. అయితే ఓ రోజు తమ వద్ద బందీగా ఉన్న వ్యక్తి వళ్ల విచిత్ర శాపానికి గురి కావడం, ఆపై తన కుమారుడిని రాజ్యానికి రాజు చేయాలనుకుంటాడు. ఈ నిర్ణయాన్ని ఆ రాజ్యానికి ఎంతో నమ్మకమైన మంత్రి, గురువు, ప్రవక్త అయిన శామ్యూల్ వ్యతిరేఖిస్తాడు. సౌల్ కుమారుడికి రాజ యోగం లేదని దేవుడు మరొకరిని ఎన్నుకున్నాడని అతని తీసుకు వస్తానని చెప్పి దేశ పర్యటనకు వెళ్లి పోతాడు.
అదే సమయంలో శాపం వళ్ల మానసిక స్థితి దిగజారి రాజు వింత వింతవింతగా ప్రవర్తిస్తుంటాడు. ఇతర రాజ్యాలు, ముఖ్యంగా గోలియత్ అనే భారీ కాయులైన జెయింట్స్ సౌల్ రాజ్యాన్ని ఆక్రమించుకుని ఇజ్రాయిల్ దేశాన్ని తమ చేతుల్లొకి తీసుకోవాలని ప్రయత్నిస్తుంటారు. మరోవైపు సౌల్ రాజ్యానికి దూరంగా ఎక్కడో మారుమూల పల్లెలో డేవిడ్ మేకలు కాస్తూ, తనకు వచ్చిన ఓ వాయిద్యం వాయిస్తూ కాలం వెళ్లదీస్తుంటాడు. అప్పటికే తల్లి చనిపోగా, ఇద్దరు చెల్లెల్లు, తండ్రితో కలిసి ఉంటాడు. ఇద్దరు అన్నలు సైన్యంలో ఉంటారు. అయితే ఎంతకు తండ్రి తనను గుర్తించడం లేదని, ఎక్కడకు వెళ్ల నీయడంలేదని, నష్ట జాతకుడిలా చూస్తున్నాడని బాధ పడుతూ ఉంటాడు.
ఈక్రమంలో వారి గ్రామానికి వచ్చిన యువరాణి డేవిడ్ సంగీతం విని తన తండ్రి పడుతున్నబాధకు సంగీతంతో ఉపశమనం కలిగించాలని రాజ్యానికి తీసుకెళుతుంది. ఈనేపథ్యంలో వారు ప్రేమించుకుంటారు. విషయం తెలిసిన రాణి డేవిడ్‌ను అక్కడి నుంచి తిరిగి ఇంటికి పంపించేస్తుంది. తిరిగి తన గ్రామం చేరిన డేవిడ్‌ను శామ్యూల్ కలిసి తలనే కాబోయే రాజుగా గుర్తించి విషయం వాళ్లింట్లో తెలిపి తన వెంట పంపించాలని కోరుతాడు. అదే సమయంలో రాజుకు మానసిక స్థితిలో హెచ్చు తగ్గులు రావడం, మరో కూతురి పెళ్లి సందర్భంగా వరుడి కుటుంబంతో గొడవ జరిగి పెద్ద సమస్య అవుతుంది. వారు క్రూరుడైన గోలియత్‌ను తమ అధీనంలోకి తెచ్చుకుని సౌల్ రాజ్యంపై దండెత్తుతాడు. అయితే ఈ సౌల్ రాజు పిచ్చి వాడిలా ప్రవర్తిస్తూ యుద్దానికి సై అంటూ యుద్ద రంగంలోకి దిగగా ఎవరూ యుద్దం చేయడానికి, జెయింట్ రాక్షసులతో పోరాటం చేయడానికి ముందుకు రారు.
ఈ నేపథ్యంలో చివరకు ఏమైంది, గోలియత్‌ను ఎలా ఎదుర్కొన్నారు, డేవిడ్ ఏం చేశాడు, యుద్దం అంటే అసలు తెలియని యువకుడు ఆ రాక్షసుడిని ఎలా అంతమొందించాడనే ఆసక్తికరమైర కథ కథనాలతో సిరీస్ సాగుతుంది. ప్రస్తుతం ఈ సిరీస్ అమోజాన్ ప్రైమ్‌లో హిందీ, ఇంగ్లీష్‌తో పాటు ఇతర విదేశీ భాషలలో అందుబాటులో ఉంది. తెలుగు, ఇతర భారతదేశ భాషలలో లేదు. ఇక ఎక్కడా ఎలాంటి అభ్యంతరకర సన్నివేశాలు లేకుండా పూర్తిగా డ్రామాతో సిరీస్ సాగుతుంది.
బ్యా గ్రౌండ్ స్కోర్ ఈ సిరీస్‌కు ప్రధాన బలం, అక్కడక్కడ చాలా లాగ్ అనిపించిన ప్రతి ఏపిసోడ్ ఏండింగ్ ఇంట్రెస్టింగ్ ముగియడంతో తర్వాత ఏం జరుగబోతుందనే ఉత్సుకతను కలిగిస్తుంది. క్రీస్తూ పూర్వం ఇజ్రాయిల్ అచార, వ్యవహరాలను, ప్రాంతాలను బాగా చూయించారు. ఇప్పటివరకు ఈ సిరీస్ గురించి తెలియని వారు, చూడని వారు, చారిత్రాత్మక సినిమాలు, సిరీస్‌లు ఇష్టపడే వారు తప్పక చూడాల్సిన సిరీస్ ఈ హౌస్ ఆఫ్ డేవిడ్. ముఖ్యంగా డేవిడ్, యువరాణి పాత్రలు, వారి స్క్రీఈన్ ప్రజెన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి.