Sachin : క్రికెట్ గాడ్ తో తమన్... ఏం చేయబోతున్నాడు...
ABN, Publish Date - Oct 06 , 2025 | 11:26 AM
గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ తో కలిసి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ వర్క్ చేయబోతున్నాడు. ఇటీవల సచిన్ తో కలిసి విమానంలో ప్రయాణం చేసిన తమన్... సీసీఎల్ లో తాను చేసిన బ్యాటింగ్ క్లిప్స్ ను సచిన్ కు చూపించాడట. సచిన్ తన బ్యాటింగ్ తీరును మెచ్చుకున్నాడని తమన్ తెలిపాడు.
సినిమా రంగానికి రాజకీయ రంగానికి అవినాభావ సంబంధం ఉన్నట్టుగానే సినిమాలకు క్రికెట్ రంగంలోని వారికి కూడా అలాంటి అనుబంధమే ఉంది. మరీ ముఖ్యంగా సినిమా రంగం వాళ్ళు ఫండ్స్ రైజ్ చేయాలనుకున్నప్పుడు చేసే మొదటి పని క్రికెట్ ఆడటం. ఒక్కోసారి సినిమా రంగానికి చెందిన వాళ్ళే వారిలో వాళ్లు క్రికెట్ ఆడిన సందర్భాలు ఉన్నాయి. అలానే ప్రొఫెషనల్ క్రికెటర్స్ తో కలిసి కూడా క్రికెట్ మ్యాచెస్ ఆడిన సందర్భాలు ఉన్నాయి. క్రికెట్ అంటే పడిచచ్చిపోయే ఫిల్మ్ స్టార్స్ కూడా ఉన్నారు. వెంకటేశ్ (Venkatesh), తరుణ్ (Tharun), శ్రీకాంత్ (Srikanth) ఆ కోవకే చెందుతారు. అలానే... సినిమా పోస్ట్ ప్రొడక్షన్ మధ్యలో సరదాగా క్రికెట్ ఆడి రిలాక్స్ అయ్యేవాళ్ళు... అవకాశం చిక్కినప్పుడల్లా మైదానంలో సీనియస్ గానే మిత్రులతో కలిసి క్రికెట్ ఆడే సినిమా వాళ్ళు చాలామందే ఉన్నారు. అందులో తమన్ కూడా ఒకరు. తమన్ అద్భుతమైన బ్యాట్స్ మ్యాన్.
విశేషం ఏమంటే... అతి త్వరలో గాడ్ ఆఫ్ క్రికెట్ (God of Cricket అని అభిమానులు ప్రేమగా పిలుచుకునే సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) తో కలిసి థమన్ (Thaman) వర్క్ చేయబోతున్నాడట. ఆ విషయాన్ని తమన్ స్వయంగా చెప్పాడు. ఈ మధ్య డల్లాస్ నుండి దుబాయ్ వస్తూ ఫ్లైట్ లో సచిన్ టెండూల్కర్ ను థమన్ కలిశాడు. ఆ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, 'కిక్రెట్ దేవుడైన లెజెండ్ సచిన్ తో కలిసి ప్రయాణించడం అద్భుతమైన అనుభవం. ఈ ప్రయాణం సందర్భంగా ముచ్చటైన సమయాన్ని గడిపాను. పనిలో పనిగా సిసిఎల్ లో నా బ్యాటింగ్ క్లిప్స్ ను ఆయనకు చూపించాను. 'నీ బ్యాట్ స్పీడ్ బాగుంది' అంటూ ఆయన ప్రశంసించారు' అని తమన్ చెప్పాడు. త్వరలో సచిన్ తో కలిసి పనిచేసే అవకాశం ఉండొచ్చని ఈ సందర్భంగా తమన్ చెప్పడం విశేషం. దాంతో ఇప్పుడు అతని అభిమానుల్లో ఏ రకంగా వీరిద్దరూ కలిసి పనిచేయబోతున్నారనే ఉత్కంఠ మొదలైంది. ఏదైనా ఛారిటీ కార్యక్రమంలో సచిన్ తో కలిసి తమన్ క్రికెట్ ఆడతాడా? లేకపోతే సచిన్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ఏదైనా ప్రొడక్ట్ కు తమన్ సంగీతం అందించబోతున్నాడా? అంటూ ఫ్యాన్స్ రకరకాల భావాలను వ్యక్త పరుస్తున్నారు.
Also Read: Rashmika Mandanna: అది మా ప్లాన్‌లో లేదు కానీ... అలా జరిగిపోయింది
Also Read: Rukmini Vasanth: అనుమానాలు పటాపంచలు.. మంచి ఆప్షన్ అయింది..