Rashmika Mandanna: అది మా ప్లాన్‌లో లేదు కానీ... అలా జరిగిపోయింది
ABN , Publish Date - Oct 06 , 2025 | 10:42 AM
నేషనల్ క్రష్ రష్మిక (Rashmika Mandanna) పేరు రెండు రోజులుగా సోషల్ మీడియాలో మార్మోగిపోతుంది. విజయ్ దేవరకొండతో (Vijay Devarakonda) ఆమె నిశ్చితార్థం జరిగిందంటూ సన్నిహిత వర్గాలు చెప్పడం
నేషనల్ క్రష్ రష్మిక (Rashmika Mandanna) పేరు రెండు రోజులుగా సోషల్ మీడియాలో మార్మోగిపోతుంది. విజయ్ దేవరకొండతో (Vijay Devarakonda) ఆమె నిశ్చితార్థం జరిగిందంటూ సన్నిహిత వర్గాలు చెప్పడం, మరో పక్క ఆమె నటించిన సినిమాలు విడుదలకు సిద్ధం కావడంతో సోషల్ మీడియాలో ఆమె గురించి చర్చ ఎక్కువగా ఉంది. అధికారికంగా కాకపోయిన నిశ్చితార్థం వార్త బయటకు రాగానే ఎక్స్‌లో ఆమె ట్రెండింగ్‌లోకి వెళ్లింది. తాజాగా ఆమె ఇన్‌స్టాలో పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా విడుదలైన ‘థామా’ (Thama Song) సాంగ్ గురించి ఆమె పోస్ట్‌లో వివరించారు. ఇటీవల ఈ సినిమా నుంచి ‘నువ్వు నా సొంతమా’ అనే పాట విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో రష్మిక గ్లామర్, డ్యాన్స్ మూమెంట్స్‌తో ఫ్లోర్ దద్దరిల్లేలా చేసింది. ఈ పాట ఎలా కార్యరూపం దాల్చిందో, దాని వెనకున్న ఆసక్తికర విషయాలు చెబుతూ పోస్ట్ పెట్టారు.
‘మేము దాదాపు 12 రోజుల పాటు ఓ ప్రదేశంలో షూటింగ్ చేశాం. ఆ చివరిరోజు మా దర్శకనిర్మాతలకు ఓ ఆలోచన వచ్చింది. ‘ఈ ప్లేస్ ఇంత బాగుంది కదా మనం ఇక్కడ సాంగ్ షూట్ ఎందుకు చేయకూడదు’ అన్నారు. అనుకోకుండా వచ్చిన ఆ ఆలోచన అందరికీ నచ్చింది. ఆ లొకేషన్ నాకు కూడా నచ్చింది. దీంతో 3-4 రోజుల్లో మేం రిహార్సిల్స్ చేసి ‘నువ్వు నా సొంతమా’ చిత్రీకరణ చేశాం. సాంగ్ చిత్రీకరణ పూర్తయ్యాక అందరం ఆశ్చర్యపోయాం. ప్లాన్ చేసిన వాటికంటే ఇది చాలా బాగా వచ్చింది. ఈ పాటను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు’ అని చె్క్ష?్పరు. రష్మిక మందన్నా, ఆయుష్మాన్ ఖురానా జంటగా నటిస్తున్న చిత్రమిది. ఆదిత్య సర్పోత్దార్ దర్శకుడు. అతీంద్రియ శక్తులతో కూడిన ఓ రొమాంటిక్ సినిమా ఇది. ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకురానుంది. ‘ది గర్ల్‌ఫ్రెండ్’ చిత్రం నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.