SS Rajamouli: గేమింగ్ ప్రపంచంలోకి దర్శక ధీరుడు
ABN, Publish Date - Jun 25 , 2025 | 01:45 PM
అంతర్జాతీయ స్థాయిలో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) ఇప్పుడు కొత్త ఎరినాలోకి అడుగుపెడుతున్నాడు.
అంతర్జాతీయ స్థాయిలో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) ఇప్పుడు కొత్త ఎరినాలోకి అడుగుపెడుతున్నాడు. అదీ తన కొడుకు ఎస్.ఎస్. కార్తికేయ (Karthikeya)తో కలిసి. ప్రముఖ జపాన్ గేమ్ డెవలపర్ హిడియో కొజిమా ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న 'డెత్ స్ట్రాండింగ్ 2: ఆన్ ది బీచ్' (Death Stranding 2) వీడియో గేమ్‌లో రాజమౌళి, అతడి కుమారుడు ఎస్.ఎస్. కార్తికేయ అతిథి పాత్రలు పోషించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
అప్పట్లో రాజమౌళి కొజిమా స్టూడియోను సందర్శించి, అక్కడ ఉపయోగిస్తున్న త్రీడి క్యారెక్టరైజేషన్ టెక్నాలజీని పరిశీలించారు. వారిద్దరి మధ్య ఈ పరిచయమే ఇప్పుడు డెత్ స్ట్రాండింగ్ 2లో వారి క్యామియోలకు దారితీసిందని తెలుస్తోంది. ఈ గేమ్ 2025 జూన్ 26న ప్లే స్టేషన్ 5 లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే రాజమౌళి ఈ విషయాన్ని జపాన్ నుండి వచ్చినప్పుడు ప్రకటించలేదు. ఇప్పుడే గేమ్ రాబోతున్న సందర్భంగా ఈ సమాచారం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండటం విశేషం. మొత్తానికీ రాజమౌళి పెదవి దాటి కొన్ని విషయాలు బయటకు రావడం అంత సాధారణ విషయం కాదని తెలుస్తోంది.
Also Read: Rajinikanth: మజ్దూర్ గా హిందీలో కూలీ...
Also Read: NTR Family: శ్రీకృష్ణ పాత్రతో రాజయోగం ఖాయం...
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి