Indian Panorama: గోవాలో సంక్రాంతికి వస్తున్నాం....
ABN, Publish Date - Nov 07 , 2025 | 05:03 PM
గోవాలో ఈ నెల 20న మొదలయ్యే అంతర్జాతీయ భారత చలన చిత్రోత్సవంలో ఇండియన్ పనోరమా కేటగిరిలో 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ ప్రదర్శితం కానుంది. అలానే మోహన్ లాల్ 'తుడరమ్'నూ ఇక్కడ ప్రదర్శించబోతున్నారు.
ప్రతి సంవత్సరం లానే ఈ యేడాది కూడా గోవా (Goa) లో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) ఘనంగా జరుగబోతోంది. గోవా రాజధాని పనాజీలోని డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ ఆడిటోరియంలో ఈ వేడుకలను కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది. నవంబర్ 20 నుండి 28 వరకూ ఈ వేడుక జరుగుబోతోంది. ఎప్పటిలానే భారతీయ భాషల్లోని సినిమాలు కొన్నింటిని ఎంపిక చేసి ఇక్కడ జరిగే ఇండియన్ పనోరమా విభాగంలో నిర్వాహకులు ప్రదర్శిస్తుంటారు. అలా ఈ సారి తెలుగులో విక్టరీ వెంకటేశ్ (Venkatesh) నటించిన 'సంక్రాంతి వస్తున్నాం' (Sankranthiki Vasthunnam) మూవీ ఈ కేటగిరికి ఎంపికైంది. అలానే మోహన్ లాల్ (Mohan Lal) లేటెస్ట్ మలయాళ చిత్రం 'తుడరమ్' ను కూడా ఇండియన్ పనోరమా విభాగంలో ప్రదర్శించబోతున్నారు. మిగిలిన సినిమాల వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ యేడాది సంక్రాంతికి విడుదలైన 'సంక్రాంతికి వస్తున్నాం' బేసికల్ గా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అయినా... అందులోనూ ఓ చిన్నపాటి మెసేజ్ ను ఇచ్చే ప్రయత్నం దర్శకుడు అనిల్ రావిపూడి చేశారు. తెలుగు సీనియర్ హీరోలు ఎవరూ దాటని రూ. 300 కోట్ల గ్రాస్ మైలురాయిని ఈ యేడాది 'సంక్రాంతికి వస్తున్నాం' దాటడం విశేషం. ఇండియన్ పనోరమాకు ఈ సినిమా ఎంపిక కావడం పట్ల చిత్ర నిర్మాతలు దిల్ రాజు, దర్శకుడు అనిల్ రావిపూడి హర్షం వ్యక్తం చేశారు.
Also Read: Sujeeth: సచిన్ తో సుజిత్.. ఫ్రేమ్ అదిరిపోయిందిగా
Also Read: Happy Birthday: కమల్ ను స్టార్ గా చేసిన తెలుగు ప్రేక్షకులు...