సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Dear Diary: కొత్త బిజినెస్ లోకి నేషనల్ క్రష్...

ABN, Publish Date - Jul 22 , 2025 | 12:26 PM

తన తోటి హీరోయిన్ల మాదిరే స్టార్ హీరోయిన్ రశ్మికా మందణ్ణ సైతం బిజినెస్ లోకి అడుగుపెట్టేసింది. అయితే... తనకిష్టమైన పెర్ ఫ్యూమ్ రంగంలోకి రశ్మిక ఎంటర్ కావడం విశేషం.

Rashmika Mandanna

సినిమాల్లో నటించే స్టార్ హీరోయిన్లు రకరకాలుగా ఆదాయాన్ని సమ కూర్చుకుంటారు. బ్రాండ్ అంబాసిడర్స్ గా వ్యవహరించడంతో పాటు వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ కోట్లు సంపాదిస్తారు. అలానే నూతన వ్యాపార సంస్థల ప్రారంభోత్సవాలలో పాల్గొనడానికీ లక్షల్లో రెమ్యూనరేషన్స్ తీసుకుంటారు. అయితే... ఇవన్నీ వారు స్టార్స్ గా ఉన్నప్పుడు జరిగేవి మాత్రమే. అందుకే వారు జయాపజయాలతోనూ, స్టార్ డమ్ తోనూ నిమిత్తం లేకుండా తమ కంటూ ఓ సొంత బిజినెస్ ఉండాలని కోరుకుంటారు. అలా కొందరు ఫిల్మ్ ప్రొడక్షన్ లోకి అడుగుపెడితే... మరికొందరు ఇంటీరియర్ డిజైనింగ్ లోకి, మరికొందరు జ్యూయలరీ వ్యాపారంలోకి అడుగుపెట్టారు. అలానే మరికొందరు యోగా ట్రైనింగ్ సెంటర్స్ పెడితే... మరికొందరు కుకింగ్ ఫీల్డ్ లోకి, హోటల్ బిజినెస్ లోకి ఎంటర్ అయ్యారు. తాజాగా నేషనల్ క్రష్ రశ్మిక మందణ్ణ (Rashmika Mandanna) సైతం ఇప్పుడో ఓన్ బిజినెస్ ను స్టార్ట్ చేసింది. అదే బ్యూటీ ప్రొడక్స్ట్ రంగం.


రశ్మికా మందణ్ణ 'డియర్ డైరీ' (Dear Diary) పేరుతో పెర్ఫ్యూమ్ బిజినెస్ మొదలు పెట్టింది. చిన్నప్పటి నుండి తన జ్ఞాపకాలతో మిళితమైన సెంట్ గురించి ఆమె వివరిస్తూ ఓ ఆసక్తికరమైన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. రశ్మిక కు ముందు కూడా కొందరు బ్యూటీ ప్రొడక్స్ట్ రంగంలోకి అడుగు పెట్టారు. రశ్మిక కూడా వారి బాటలోనే సాగబోతోంది. రశ్మిక అందించే పెర్ ఫ్యూమ్ ధర రూ. 1600 నుండి రూ. 2,600 వరకూ ఉండే అవకాశం ఉందట. జాతీయ స్థాయిలో స్టార్ హీరోయిన్ గా బోలెడంత క్రేజ్ తెచ్చుకున్న రశ్మిక మందణ్ణకు ఈ కొత్త వ్యాపారం ఏమేరకు కలిసి వస్తుందో చూడాలి.

Also Read: Harihara Veeramallu: తెలంగాణలో గ్రేట్ ట్విస్ట్...

Also Read: Hari Hara Veera Mallu: వీరమల్లుకు క్రిష్‌ విషెస్...

Updated Date - Jul 22 , 2025 | 12:28 PM