Pa Ranjith: పీ.ఎన్.జీ. దేశం నుండి ఆస్కార్ కు ఎంట్రీ
ABN, Publish Date - Aug 28 , 2025 | 01:28 PM
ప్రముఖ తమిళ దర్శకుడు, నిర్మాత పా. రంజిత్ (Pa. Ranjith) ప్రస్తుతం క్లౌడ్ నైన్ లో ఉన్నారు. ఆయన సహ నిర్మాతగా వ్యవహరించిన 'పాపా బుకా' సినిమా ఆస్కార్ కు నామినేట్ అయ్యింది.
ప్రముఖ తమిళ దర్శకుడు, నిర్మాత పా. రంజిత్ (Pa. Ranjith) ప్రస్తుతం క్లౌడ్ నైన్ లో ఉన్నారు. ఆయన సహ నిర్మాతగా వ్యవహరించిన ఓ సినిమా ఆస్కార్ కు నామినేట్ అయ్యింది. విశేషం ఏమంటే.. పపువా న్యూ గినీ (Papua New Guinea) అనే దేశం స్వాతంత్ర్యం పొంది 50 సంవత్సరాలు అయ్యింది. ఆ దేశం నుండి ఆస్కార్ (Oscar) కు అధికారికంగా ఎంపికైన సినిమా ఇదే!
'పాపా బుకా' (Papa Buka) అనే ఈ సినిమాను మూడు జాతీయ అవార్డులు అందుకున్న మలయాళ దర్శకుడు బిజుకుమార్ తెరకెక్కించాడు. ఈ సినిమాను అక్షయ్ కుమార్ పరిజా, ప్రకాశ్ బరే, నోయెలెన్ తౌలా తో కలిసి పా. రంజిత్ నిర్మించాడు. ఈ సినిమాను పపువా న్యూ గినీ దేశం 98వ అకాడమీ అవార్డులలో ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరికి పంపింది. ఈ విషయాన్ని తెలియచేస్తూ పా. రంజిత్ హర్షం వ్యక్తం చేశాడు. రెండో ప్రపంచ యుద్థంలో పుపువా న్యూ గినీ లో పోరాడిన భారతీయ సైనికుల గురించి తీసిన సినిమా ఇది. ఇందులో ఆ దేశ నటీనటులతో పాటు భారతీయులైన రీతాభరి చక్రవర్తి, ప్రకాశ్ బరే కూడా నటించారు. ఈ మూవీ సెప్టెంబర్ 19న విడుదల కాబోతోంది. తమ దేశ సంస్కృతి సంప్రదాయాలను తెలియచేసే ఈ సినిమాను ఆస్కార్ కు ఎంపిక చేయడం ఆనందాన్ని కలిగించిందని పపువా న్యూ గినీ ఆస్కార్ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ డాన్ నైల్స్ చెప్పారు.
Also Read: Tourist Family: సౌందర్య రజనీకాంత్ నిర్మాతగా...
Also Read: Coolie and Lokah: ఫిల్మ్ మేకర్స్ తప్పు మీద తప్పు...