సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Tollywood: న్యూ హీరోయిన్స్ హవా

ABN, Publish Date - Jun 24 , 2025 | 09:10 AM

టాలీవుడ్‌లో కొత్త హీరోయిన్స్ జోరు మామూలుగా లేదు. ఒక్కొక్కరూ ఒక్కో రకంగా దూసుకుపోతూ ఇండస్ట్రీలో తమ స్థానం కోసం గట్టిగా పోటీ పడుతున్నారు. ఈ అందాల తారల్లో ఎవరు ఏ రీతిలో దూసుకుపోతారో తెలుసుకుందాం...

ప్రతి ఏటా కొత్త ముద్దుగుమ్మలు వెండితెరపై సందడి చేస్తూనే ఉంటారు. టాలీవుడ్ లో కి ప్రెజెంట్ కొత్తగా చాలా మంది బ్యూటీస్ వచ్చి చేరారు. తమ అందచందాలతో ఆడియెన్స్ అట్రాక్ట్ చేస్తూ.. అవకాశాలను కొల్లగొడుతున్నారు. మమితా బైజు (Mamitha Baiju) పేరు ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్. ఈ జూనియర్ బ్యూటీ సీనియర్ హీరోయిన్స్‌కు ఏమాత్రం తగ్గకుండా దూసుకుపోతోంది. వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం 'డ్యూడ్‌'తో పాటు, సూర్య 46లో నటిస్తోంది. అంతటితో ఆగకుండా దళపతి విజయ్‌ తో 'జన నాయగన్' లో పవర్ ఫుల్ రోల్ లో కనిపించనుంది.


స్టార్ కిడ్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) టాలీవుడ్‌లో గట్టి మార్క్ వేస్తోంది. 'దేవర' సినిమాతో ఇప్పటికే తెలుగు ప్రేక్షకుల మనసు గెలిచిన ఈ అమ్మడు, ఇప్పుడు మరో బిగ్ ప్రాజెక్ట్‌తో మ్యాజిక్ చేయడానికి రెడీ అవుతోంది. క్రేజ్, గ్లామర్, నటన మిక్స్ చేసి టాలీవుడ్‌లో హాట్ ట్రెండ్‌గా మారుతోంది. మరో బ్యూటీ మాళవికా మోహనన్ (Malavika Mohanan) దూకుడు మామూలుగా లేదు. పాన్ ఇండియా సినిమాలతో ఈ బ్యూటీ రచ్చ రేపుతోంది. ప్రస్తుతం 'ద రాజా సాబ్' మూవీతో తెలుగు ఆడియన్స్‌ను అలరించేందుకు సిద్ధమవుతోంది. 'అప్పుడో ఇప్పుడు ఎప్పుడో' సినిమాతో గ్లామర్ డోస్ పెంచి అందరి దృష్టిని ఆకర్షించింది రుక్మిణీ వసంత్ (Rukmini Vasanth). ఇప్పుడు ప్రశాంత్ నీల్ - ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న 'డ్రాగన్'లో... శివకార్తికేయన్‌ 'మదరాసి'లో మెరవనుంది. 'హిట్ 3'తో టాలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన శ్రీనిధి శెట్టి, ఇప్పుడు 'తెలుసు కదా' సినిమాతో బిజీగా ఉంది. ఈ మూవీ హిట్ అయితే ఈ వయ్యారికి మరిన్ని అవకాశాలు లభించడం ఖాయం అని విశ్లేషిస్తున్నారు. అలాగే 'ఓం భూమ్ భుష్‌'లో నటించిన ప్రీతి ముకుందన్ (Prithi Mukundan) 'కన్నప్ప'లో కథానాయికగా నటించింది. ఆమె తన నటనతో అందరినీ ఆకట్టుకునేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే బయటకు వచ్చిన ప్రమోషన్ కంటెంట్ లో అదరగొట్టేసిందీ భామ.


ఐశ్వర్య మీనన్ కూడా తన సినిమాల స్పీడ్‌ను పెంచేసింది. 'స్పై, భజే వాయు వేగం' సినిమాలతో అలరించిన ఈ బ్యూటీ, ఇప్పుడు పాన్ ఇండియా మూవీ 'నాగబంధం'తో రాబోతోంది. ఈ బ్యూటీ టాలెంట్, గ్లామర్ చూస్తే టాప్ లీగ్‌లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకో చిన్నది కాజల్ చౌదరి. ఆమె 'అనగనగా' సినిమాతో తన మార్క్ వేసింది. ఇప్పుడు 'కరాలి, అట్లాస్ సైకిల్ అత్తగారు పెట్లే' వంటి సినిమాలతో బిజీగా మారింది. రితికా నాయక్ కూడా సైలెంట్‌గా వరుస సినిమాలతో రచ్చ చేస్తోంది. 'అశోక వనంలో అర్జున కళ్యాణం' తర్వాత కొన్ని సినిమాలను లైన్ లో పెట్టింది. ప్రెజెంట్ 'మిరాయ్', వరుణ్ తేజ్‌, ఆనంద్ దేవరకొండ 'డ్యుయేట్' ప్రాజెక్ట్‌ల్లో నటిస్తోంది. ఇలా పలువురు నూతన తారలు తమ అందచందాలతోనూ, అభినయ పటిమతోనూ ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు. మరి వీరిలో జనం మదిలో పదికాలాల పాటు నిలిచే దెవరో చూడాలి.

Also Read: Kannappa: నెమ‌లి ఏది క‌న్న‌ప్ప‌! ఈవెంట్ల‌లో కనిపించ‌ని హీరోయిన్‌

Also Read: Star Movies: సెన్సిబుల్ సినిమాలకు సెన్సార్ చిక్కులు

Updated Date - Jun 24 , 2025 | 09:19 AM