సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Ne Zha 2: ఈ యేడు.. ప్ర‌పంచంలో తోపు సినిమా ఇదే

ABN, Publish Date - Dec 30 , 2025 | 02:34 PM

చైనీస్ మూవీ నే ఝా 2 అఖండ విజయాన్ని అందుకుంది. 2025లో అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన చిత్రంగా 'నే ఝా 2' అగ్రస్థానంలో నిలిచింది.

Ne Zha 2 Movie

చైనీస్ యానిమేటెడ్ ఫాంటసీ సినిమా 'నే ఝా 2' (Ne Zha 2) 2025లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. విశేషం ఏమంటే ఇది చైనీస్ యానిమేషన్ మూవీ. ఇదిలా ఉంటే ఈ యేడాది భారత్ లో రూపుదిద్దుకున్న డివోషనల్ యానిమేషన్ మూవీ 'మహావతార్ నరసింహ' (Mahavatar Narasimha) కూడా అఖండ విజయాన్ని అందుకుంది. ఇక 'నే ఝా 2' విషయానికి వస్తే... ఇది కూడా పౌరాణిక పాత్రతో తెరకెక్కిందే. జు ఝాంగ్లిన్ రాసిన 'ఇన్వెస్టిచర్ ఆఫ్‌ ది గాడ్స్' ఆధారంగా ఈ సినిమాను జియో వోజీ తెరకెక్కించాడు. 2019లో వచ్చిన 'నే ఝా'కు ఇది సీక్వెల్. ఓ కీలక సంఘటన తర్వాత నే ఝా శరీరాన్ని మాత్రమే తిరిగి సృష్టించగలుగుతాయి. అయితే అతను తన స్నేహితుడు ఆవో బింగ్ ఆత్మను పొందుతాడు. మాస్టర్ షెన్ వ్యతిరేకంగా నే ఝా సాగించే పోరాటమే ఈ సీక్వెల్ మూవీ.


ఈ యేడాది జనవరి 29న ఈ సినిమా చైనాలో అంతటా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్న ఈ సినిమా ఘన విజయాన్ని సాధించింది. తొలుత దీన్ని మాండరిన్ లో రూపొందించారు. ఆ తర్వాత ఇంగ్లీష్, హిందీ భాషల్లోకి డబ్ చేశారు. నే ఝా అనే బాలుడి సాహస కృత్యాలతో తెరకెక్కిన ఈ మైథలాజీ మూవీ ఏకంగా రూ. 19 వేల కోట్ల ను వసూలు చేసి వరల్డ్ వైడ్ 2025కు టాప్ గ్రాసర్ గా నిలిచింది. దాంతో ప్రపంచ సినీ ప్రేమికులకు మైథాలజీ జానర్, యానిమేషన్ మూవీస్ పట్ల ఉన్న అభిమానం మరోసారి రుజువైంది.

Also Read: Nandamuri Balakrishna: మరింత తగ్గుతున్న 'అఖండ 2' టిక్కెట్ రేట్లు!

Also Read: Star Boy Siddhu: హీరోగా ఆరు... సితారలో మూడు!

Updated Date - Dec 30 , 2025 | 03:18 PM