Raviteja: టిల్లు, మ్యాడ్.. క్రాస్ ఓవర్ సినిమాకి నేను రెడీ
ABN , Publish Date - Oct 22 , 2025 | 12:34 PM
టిల్లూ, మాడ్ ఫ్రాంచైజీల క్రాస్‌ఓవర్ సినిమా ఐడియాపై రవితేజ రెస్పాన్స్ ఇచ్చాడు.
టాలీవుడ్‌లో ఇప్పుడు ఫ్రాంచైజీలు, సినీ యూనివర్స్ కాన్సెప్ట్‌ల హావా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పెద్ద బడ్జెట్ సినిమాలే కాకుండా చిన్న బడ్జెట్ సినిమాలు కూడా ఇప్పుడు ఫ్రాంచైజీలుగా మంచి ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. కేజీఎఫ్ , కాంతార వంటి భారీ చిత్రాలు రెండేసి భాగాలుగా విడుదలై సంచలన విజయం సాధించగా సలార్, దేవర ఆ లైన్‌లో ఉన్నాయి.
ఇక తెలుగులో మ్యాడ్, టిల్లు వంటి చిన్న బడ్జెట్ సినిమాలు సీక్వెల్స్ గా వచ్చి మంచి సూపర్ హిట్‌గా నిలిచాయి. ఈ క్రమంలో ఈ చిత్రాలన్నింటికీ మూడో భాగాలు కూడా సిద్దమవుతున్నాయి. సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన DJ టిల్లు ఫ్రాంచైజీలో ఇప్పటివరకు రెండు సినిమాలు రాగా రెండు బ్లాక్‌బస్టర్స్ అవ్వడమే కాకుండా, టిల్లూ క్యారెక్టర్‌కి సూపర్ పాపులారిటీ తెచ్చాయి.
ఇక ఇప్పుడు ఈ సిరీస్‌లో మూడో భాగం టిల్లూ క్యూబ్ ( Tillu Cube) రాబోతోంది. సిద్దు ప్రస్తుతం తను చేస్తున్న ప్రాజెక్టులు పూర్తి చేసిన వెంటనే ఈ షూటింగ్ మొదలవుతుంది. కళ్యాణ్ శంకర్ ( Kalyan Shankar) దర్శకత్వంలో మాడ్ ఫ్రాంచైజీ కూడా ఇప్పుడు మాడ్ క్యూబ్ (MAD Cube)గా మూడో పార్ట్ స్క్రిప్ట్ కూడా రెడీగా ఉందని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. అంతేగాక టిల్లూ క్యూబ్ మరియు మాడ్ క్యూబ్ కలసి క్రాస్ ఓవర్ సినిమాగా తెరకెక్కనుందని. దీనికి కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించనున్నట్లు న్యూస్ వైరల్ అవుతోంది.
ఇటీవల విడుదలకు సిద్ధమైన మాస్ జాతర (Mass Jathara) ప్రమోషన్ ఇంటర్వ్యూలో రవితేజ (Ravi Teja), సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ (Sithara Entertainments) నిర్మాత నాగ వంశీ, దర్శకుడు కళ్యాణ్ శంకర్ పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఈ క్రాస్‌ఓవర్ గురించి మాట్లాడిన రవితేజ.. నేను రెడీనే! ఇలాంటి కొత్త ప్రయోగాలకు ఎప్పుడూ ఓపెన్‌గానే ఉంటాను అన్నారు. అదే సమయంలో ఫాహాద్ ఫాసిల్ చేసిన ఆవేశంలాంటి స్ట్రాంగ్ క్యారెక్టర్ రోల్ వస్తే కూడా తప్పకుండా చేస్తా అని పేర్కొన్నారు.
దీనిపై కళ్యాణ్ శంకర్ సరదాగా స్పందిస్తూ.. దానికి మాస్ మాడ్ క్యూబ్ అని పేరు పెట్టేద్దాం అంటూ బదులిచ్చారు. ఇదిలాఉంటే.. రవితేజ ప్రస్తుతం కిశోర్ తిరుమల దర్శకత్వంలో “భర్త మహాశయులకూ విజ్ఞప్తి అనే సినిమాలో బిజీగా ఉన్నారు. అలాగే శివ నిర్వాణతో ఒక థ్రిల్లర్, కళ్యాణ్ శంకర్‌తో ఒక సూపర్ హీరో సినిమా కోసం చర్చలు కొనసాగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.