Suriya: సూర్యకు మరోసారి దురదృష్టం.. గోల్డెన్ ఛాన్స్ మిస్!
ABN , Publish Date - Oct 22 , 2025 | 01:18 PM
గత సంవత్సరం దీపావళికి విడుదల కావాల్సిన ‘కంగువా’ రిలీజ్ మిస్ కావడంతో నష్టపోయిన సూర్య, మరోసారి కొత్త సినిమా ‘కరుప్పు’ విషయంలోనూ అదే పునరావృతం అయింది.
తమిళంతో పాటు తెలుగలోనూ స్టార్ హీరోగా సూర్య (Suriya)కి ప్రత్యేక క్రేజ్ ఉంది. అయితే గత కొన్నేళ్లుగా మాత్రం ఆయన కెరీర్‌లో తన స్థాయి హిట్ అందుకోవడంలో మాత్రం విఫలమవుతూ వస్తున్నాడు. ముఖ్యంగా కంగువా, రెట్రో సినిమాల విడుదలకు ముందు ఆరీ అంచనాలు నెలకొన్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం చవిచూశాయి. దాంతో ఆర్జే బాలాజీ దర్శకత్వంలో రూపొందుతున్న కురుప్పు (Karuppu) చిత్రంపై అందరి చూపు ఉంది.
ఈక్రమంలో ఈ మూవీతో ఎలాగైనా హిట్ కొట్టి తీరాలని సూర్య పక్కా ప్లాన్ వేసుకున్నాడు. యాక్షన్, ఎమోషన్, ఎంటర్‌టైన్‌మెంట్‌తో నిండిన ఈ కమర్షియల్ మసాలా ఎంటర్‌టైనర్‌ను దీపావళికి రిలీజ్ చేయాలనే ఆలోచనలో టీమ్ ముందుకు వెళ్లింది. కానీ అనుకోని కారణాల వల్ల సినిమా రిలీజ్ వాయిదా పడింది. దర్శకుడు ఆర్జే బాలాజీ (RJ Balaji) కూడా తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో దీపావళికి రిలీజ్ చేయాలనే ఉద్దేశ్యమే ఉన్నట్టు వెల్లడించాడు. కానీ, పరిస్థితుల దృష్ట్యా సినిమా వాయిదా పడగా దాని ప్లేస్‌లో ఒక పాటను విడుదల చేయాల్సి వచ్చిందన్నారు.
ఇదిలాఉంటే.. ఈసారి దీపావళి సందర్భంగా తమిళనాడులో స్టార్ హీరో సినిమాలు ఏవీ రిలీజ్ కాకపోవడం గమనార్హం. ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్ (Dude), ధృవ్ విక్రమ్ భైసన్ (Bison), హరీష్ కళ్యాణ్ డిజిలీ (Diesel) వంటి మీడియం రేంజ్ హీరోల సినిమాలే థియేటర్లలోకి వచ్చాయి. ఇవన్నీ A సెంటర్ ఆడియెన్స్‌ను మాత్రమే టార్గెట్ చేసినవే. మాస్ ఆడియెన్స్ కోసం సరైన సినిమా లేకపోవడంతో తమిళనాడు బాక్సాఫీస్ వద్ద ఉత్సాహం పూర్తిగా తగ్గిపోయింది.
తెలుగులో కూడా ఈ దీపావళికి పెద్ద సినిమాల విడుదల లేకపోవడంతో, సూర్య కురుప్పుతో థియేటర్లలోకి వచ్చి ఉండుంటే రెండు భాషల్లోనూ బంపర్ ఓపెనింగ్స్ దక్కే అవకాశం ఉండేదని ఫర్వాలేదనే టాక్ వచ్చినా బ్లాక్ బస్టర్ అయ్యేదని, కలెక్షన్లు కూడా వచ్చేవని అభిమానులు, నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. సూర్య మంచి గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్నాడని నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
అయితే..గత సంవత్సరం కూడా సూర్య కంగువాని దీపావళికే ప్లాన్ చేశాడు. కానీ ఆ సినిమా నవంబర్ 14కి వాయిదా పడింది. ఫలితంగా సినిమాకు వర్కింగ్ డేస్‌లో ఓపెనింగ్స్ బలహీనంగా వచ్చాయి. ఆ సినిమా డిసాస్టర్‌గా నిలిచింది. మొత్తం మీద సూర్యకు వరుసగా రెండోసారి దీపావళి రిలీజ్ మిస్ అయింది. ఒకసారి కంగువా టైమ్ మిస్ అవడం వల్ల భారీ నష్టం చవిచూసిన సూర్యకు ఈ మారు ఎలాంటి ఫళితం వస్తుందో వేచి చూడాలి.