ANR College: కాలేజీకి .. నాగార్జున రూ2. కోట్ల విరాళం

ABN , Publish Date - Dec 17 , 2025 | 02:38 PM

అక్కినేని నాగేశ్వరరావు కాలేజ్ వజ్రోత్సవాలు మూడు రోజుల పాటు గుడివాడలో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా తమ ఫ్యామిలీ మెంబర్స్ తరఫున రూ. 2 కోట్ల రూపాయలను విరాళంలో ఇవ్వబోతున్నట్టు నాగార్జున ప్రకటించారు.

Anr College, Gudivada

గుడివాడలోని అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswara Rao) కాలేజీకి ఓ చరిత్ర ఉంది. ఈ కాలేజీలో చదువుకున్న ఎంతోమంది విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. అలాంటి వారందరూ డిసెంబర్ 16, 17, 18 తేదీలలో జరుగుతున్న వజ్రోత్సవంలో పాల్గొంటున్నారు. రెండవ రోజు జరిగిన కార్యక్రమంలో అక్కినేని నాగేశ్వరరావు పెద్ద కుమారుడు వెంకట్ (Venkat), ఆయన భార్య జ్యోత్స్న, నాగేశ్వరరావు కుమార్తె నాగ సుశీల (Naga Suseela), నాగేశ్వరరావు చిన్నకొడుకు నాగార్జున (Nagarjuna) ఈ వేడుకలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున మాట్లాడుతూ, 'నాన్నగారు శతజయంతి వేడుకలు ఇటీవలే చేసుకున్నాం. అక్కినేని నాగేశ్వరావు కళాశాల పెట్టి 75 సంవత్సరాలు అయితే. అన్నపూర్ణ స్టూడియోస్ పెట్టి 50 యేళ్ళు అవుతోంది. అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా పెట్టి పదేళ్ళు అవుతోంది. ఈ ఫంక్షన్ లో పాల్గొనడం సంతోషంగా కంటే గర్వంగా ఉంది. మనుషులు శాశ్వతం కాదు. వాళ్ళు చేసే పనులు శాశ్వతం. నాన్నగారు చేసిన మంచి పనుల్లో ఈ ఎ.ఎన్.ఆర్. కాలేజీ ఓ ఉదాహరణ. తాను చదువుకోక పోయినా. వేలాది మంది చదువుకోవాలని, వారికి బంగారు భవిష్యత్తు ఉండాలని, నేను పుట్టిన సంవత్సరం 1959లో, ఈ కాలేజీకి లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చారు. బహుశా అప్పుడు నాన్నగారికి సినిమాకు ఐదు వేలు లేదా పది వేలు పారితోషికం వచ్చేది. అలానే ఆంధ్ర యూనివర్సిటీకి పాతిక వేలు, మద్రాస్ యూనివర్సిటీకి పాతిక వేలు విరాళం ఇచ్చారు.

ఈ కాలేజీలో చదువుకున్న వారు ఎంతోమంది జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతిని గడించారు. త్వరలో ఈ కాలేజీ లో స్కిల్ డెవలప్ మెంట్ ఫ్యాకల్టీ ప్రారంభిస్తున్నారని తెలిసి సంతోషించాను. దీని ప్రారంభోత్సవానికి రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌ రేపు రాబోతున్నారు. స్థానిక ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గారు తదితరులు దీని అభివృద్ధికి కృషి చేస్తారని భావిస్తున్నారు. అలానే అక్కినేని నాగేశ్వరరావు గారి కుటుంబం తరఫున ఆయన పేరుతో స్కాలర్ షిప్ ప్రతి యేడాది ఇవ్వాలని అనుకుంటున్నాం. అందుకు గానూ మూలధనంగా రెండు కోట్ల రూపాయలను కాలేజీ కమిటీకి ఇస్తున్నాం' అని అన్నారు. తన మనసులోని భావాలను ముగింపు ఉత్సవంలో చెబుతానని అక్కినేని వెంకట్ అన్నారు. రెండో రోజు జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ పార్లమెంట్ సభ్యులు కావూరి సాంబశివరావు, గుడివాడ ఎమ్మెల్యే రాము, రాజ్యసభ మాజీ సభ్యులు యలమంచిలి శివాజీ, యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, జస్టిస్ భట్టు దేవానంద్ తదితరులు పాల్గొన్నారు.

Also Read: 2016-2025 Tollywood: ఏ సంవత్సరం ఏది బ్లాక్ బస్టర్...

Also Read: James Cameron, SS Rajamouli: వార‌ణాసి.. సెట్‌కు రావాల‌ని ఉంది! కామెరాన్, రాజమౌళి మ‌ధ్య‌ ఆసక్తికర చర్చ

Updated Date - Dec 17 , 2025 | 08:17 PM