Jaanvi Swarup: మహేశ్ కూతురికి చెక్ పెట్టిన మేనకోడలు.. మంజుల పెద్ద స్కెచ్చే వేసింది
ABN, Publish Date - Nov 08 , 2025 | 05:45 PM
మంజుల ఘట్టమనేని కుమార్తె జాన్వీ నటించిన ప్రకటన విడుదలైంది. ఆ ప్రకటనలో మంజుల కూడా పాలుపంచుకున్నారు. విశేషం ఏమంటే ఇవాళ మంజుల ఘట్టమనేని పుట్టిన రోజు.
సూపర్ స్టార్ కృష్ణ (Krishna) కుమార్తె మంజుల (Manjula) పుట్టిన రోజు నవంబర్ 8. విశేషం ఏమంటే ఈ రోజున కూతురు జాన్వీ స్వరూప్ ఘట్టమనేని (Jaanvi Swarup Ghattamaneni) తో పాటు మంజుల నటించిన ఆభరణాల ప్రకటనను విడుదల చేశారు. విజయవాడకు చెందిన కౌషిక్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ నుండి రెండు ప్రచార చిత్రాలు వచ్చాయి. అందులో ఒకదానిలో జాన్వీ స్వరూప్ నటించగా, రెండో దానిలో జాన్వీతో పాటు ఆమె తల్లి మంజుల కూడా నటించింది.
విశేషం ఏమంటే... కృష్ణ కుమారుడు మహేశ్ బాబు (Mahesh Babu) కూతురు సితార సైతం తన కెరీర్ ను ప్రచార చిత్రాలతోనే మొదలు పెట్టింది. జీఎంజే జ్యువెల్స్ లో తండ్రి మహేశ్ బాబుతో పాటు సితార (Sithara) యాక్ట్ చేసింది. అలానే లిల్ గుడ్ నెస్ కు తల్లి నమ్రతతో కలిసి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించింది. సరిగ్గా మేనకోడలు సితార బాటలోనే తన కూతురు జాన్వీని సైతం రంగంలోకి దించింది మంజుల ఘట్టమనేని. ఇప్పటికే మంజుల, ఆమె భర్త సంజయ్ స్వరూప్ సినిమాల్లో నటిస్తున్నారు. మంజుల ఫిట్ నెస్, డైటింగ్, యోగాకు సంబంధించిన వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటారు. ఆ మధ్య జాన్వీ బర్త్ డే సందర్భంగా తన కుమార్తె కెమెరా ముందుకు రాబోతోందని రాబోతోందని మంజుల తెలిపింది. అయితే సినిమాల్లో హీరోయిన్ గా కంటే ముందు జాన్వీ ని బ్రాండ్ అంబాసిడర్ గా ఎంట్రీ ఇప్పించడం చర్చనీయాంశంగా మారింది. మహేశ్ కూతురు సితార రెమ్యూనరేషన్ తట్టుకోలేని ప్రకటన దారులకు జాన్వీ ఓ రకంగా వరం అనుకోవచ్చు. పైగా జాన్వీ కెమెరా ఫ్రెండ్లీగా కనిపిస్తోంది. ఆమె మేనమామ మహేశ్ బాబు ఇవాళ టాలీవుడ్ లో అత్యధిక ప్రకటనలు చేస్తున్న హీరో. సో... అవే లక్షణాలను పుణికి పుచ్చుకుని జాన్వీ సైతం బ్రాండ్ అంబాసిడర్ గా తనదైన ముద్రను వేస్తుందేమో చూడాలి. ఏదేమైనా మంజుల పుట్టిన రోజు సందర్భంగా ఈ ప్రకటనలు రావడం కృష్ణ అభిమానులను ఆనంద పరుస్తోంది.
Also Read: Ritesh Rana Movie: తెలుగులో ఎంట్రీ ఇస్తున్న మిస్ యూనివర్స్ ఇండియా...
Also Read: Businessman: బిజినెస్‌మేన్ రీరిలీజ్ డేట్ ఫిక్స్