Kethireddy Jagadiswar Reddy : తమిళనాడులో తెలుగువారి మేలు చేసే పార్టీ రావాలి
ABN, Publish Date - Nov 28 , 2025 | 06:08 PM
తెలుగు రాజధాని అమరావతి నిర్మాణం త్వరిత గతిన పూర్తి కావాలని, తెలుగు సినిమా రంగంలోని సమస్యలన్నీ తీరిపోవాలని తిరుమల వేంకటేశ్వరుని ప్రార్థించినట్టు నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. ఇటీవల ఆయన తిరుమలలో వేంకటేశ్వరుడిని దర్శించుకున్నారు.
వచ్చే యేడాది తమిళనాడు (Tamilanadu) లో అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఆ రాష్ట్రంలో తెలుగు వారికి అండదండలుగా ఉండే రాజకీయ పార్టీ విజయం సాధించాలనే ఆకాంక్షను ప్రముఖ తెలుగు నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి (Kethireddy Jagadiswar Reddy) వ్యక్తం చేశారు. తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడైన ఆయన తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కు అధ్యక్షుడు కూడా. కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఇటీవల తిరుమల వెళ్ళి శ్రీవారి దర్శనం చేసుకున్నారు.
ఆ సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి (Amaravathi) నిర్మాణం త్వరిత గతిన పూర్తి అయ్యి, అది భారతదేశంలో మరో గొప్ప రాజధానిగా వెలుగొందాలని వేంకటేశ్వరుని ప్రార్థించినట్టు చెప్పారు. అలానే రాబోయే రోజుల్లో భారతదేశమే కాకుండా తెలుగు వారి రెండు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని కోరుకున్నట్టు తెలిపారు. ముఖ్యంగా పలు వివాదాలతో సతమతమౌతున్న తెలుగు సినిమా పరిశ్రమ కష్టాలన్నీ తీరిపోయేలా చేయమని వేంకటేశ్వరునితో పాటు తిరుమలలోని జపాలి ఆంజనేయ స్వామి ఆలయంలోనూ మొక్కుకున్నానని కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి చెప్పారు.
Also Read: Dharamendra: ధర్మేంద్రకు వినూత్న నివాళి
Also Read: Revolver Rita Movie review: కీర్తి సురేశ్.. రివాల్వర్ రీటా మూవీ రివ్యూ